ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఓ పక్క టెక్నాలజీ రోజుకో తీరుగా పరుగులు పెడుతోంది. అయితే.. ఈ రోజుల్లోనూ కొందరు చేతబడి గురించి మాట్లాడుకోవడం, చాలామంది దానిని నమ్మటం ఆశ్చర్యంగా అనిపించకమానదు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నటుడు సుమన్ గతంలో తనపై చేతబడి ప్రయోగం జరిగిందని కేరళ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చెప్పాడు. అంతే.. సుమన్ మాటలను పట్టుకున్న కొందరు నెటిజన్లు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై కూడా అలాంటి ప్రయోగమే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. తారక్ పాత వీడియో ఒకటి బయటికి తీసి మరీ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం లీన్ లుక్‌లోకి మారిపోయాడు. అయితే ఎన్టీఆర్‌ను అలా చూడటం ఇష్టంలేని చాలామంది తారక్‌కు ఏదో అయిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంకొంతమంది.. తారక్ సినిమాల్లో వచ్చిన కొత్తల్లో ఉన్నట్లుగా చబ్బీగా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్… ‘నాపై చేతబడి వంటిదేమీ జరగలేదు. పిచ్చి పిచ్చి ప్రచారాలు ఆపండి’ అని వార్నింగ్ ఇవ్వటం కనిపిస్తోంది. నెటిజన్లు మాత్రం ఆ పాయింటునే పట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాతి వీడియో అది. ప్రమాదంపై పలు పుకార్లు వ్యాపించటంతో ఆ ప్రమాదం ఎలా జరిగిందో.. అప్పట్లో రిలీజైన ఆ వీడియోలో తారక్ వివరించాడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను, తన స్నేహితులు తాగి వాహనం నడపలేదని తారక్ చెప్పాడు. అలాగే ఇది ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగిన యాక్సిడెంట్ కాదన్నాడు. కొంతమంది నిజం తెలియకుండా మాట్లాడటంపై అప్పట్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
