Business Ideas: పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్! నమ్మకంతో పని చేస్తే భారీ ఆదాయం పొందొచ్చు!
పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించే గొప్ప వ్యాపార మార్గం కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సప్లై. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల నుండి అడ్వాన్సులు తీసుకుని, నిర్మాణ సామాగ్రిని బల్క్‌గా సరఫరా చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. మాట్లాడే నేర్పు, నాణ్యతతో కూడిన సప్లై నైపుణ్యం ఉంటే చాలు.

బిజినెస్ చేయాలంటే ముందుగా ఎవరైనా ఆలోచించే విషయం పెట్టుబడికి డబ్బులు ఎలా అని. అలాంటి అసలు పెట్టుబడి లేకుండా మంచి బిజినెస్ చేయొచ్చు అంటే నమ్ముతారా? అది కూడా సాధారణ చిన్నా చితకా బిజినెస్ కాదు. లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ బిజినెస్‌కు ఒక స్ట్రక్చర్ అంటూ ఉండదు. నమ్మకం, మంచి మాటకారి తనంతో ఈ వ్యాపారంలో రాణించవచ్చు. ఇంతకీ బిజినెస్ ఏంటంటే.. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయ్.
నిర్మాణ రంగం ఎప్పుడూ డిమాండ్ తగ్గకుండా ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున జరిగే నిర్మాణాలను కాంట్రాక్టర్లు పూర్తి చేస్తారు. అయితే గ్రామాల్లో, చిన్న చిన్న టౌన్లలో కూడా అలాంటి కాంట్రాక్ట్ పనులు చేయొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వం ఏకంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుండటంతో లబ్ధిదారులు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అయితే ఇంటి నిర్మాణం అనుకున్నంత సులువు కాదు. ఇసుక, ఇటుక, సిమెంట్, రాడ్, సెంట్రింగ్, సుతారీ మేస్త్రీలు, టైల్స్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇలా చాలా పనులు ఉంటాయి.
వీటిని గ్రామాల్లో ఉంటే వారు, రోజు కూలీలకు వెళ్లే వారికి పెద్దగా అవగాహన ఉండదు. పైగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పేదలే లబ్ధిదారులుగా ఉన్నారు. అలాంటి వారు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద సుతారీ మేస్త్రీపై ఆధారపడుతున్నారు. అలాంటి వారితో మాట్లాడుకొని ఇంటి నిర్మాణ కాంట్రాక్ట్, లేదా మెటీరియల్ సప్లయ్ కాంట్రాక్ట్‌లు తీసుకొని, వారి నుంచే అడ్వాన్సులు తీసుకొని దాంతో మెటీరియల్ తెప్పించి మంచి ఆదాయం పొందవచ్చు. బల్క్‌లో ఏది కొన్నా తక్కువ ధరకే వస్తుంది కనుక ఒకే గ్రామంలో రెండు కంటే ఎక్కువ ఇళ్లు కాంట్రాక్ట్‌లు తీసుకొని మెటీరియల్ తక్కువ ధరకు తెప్పించి, మంచి మార్జిన్ చూసి అమ్మవచ్చు. దీని కోసం ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, కానీ ఇళ్ల లబ్ధిదారులకు మాట్లాడే నేర్పు, మంచి నాణ్యమైన మెటీరియల్ సప్లయ్ చేయగలిగే నైపుణ్యం ఉంటే చాలు. కొన్ని నెలల్లో లక్షలు సంపాదించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
