విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలో ప్రయాణించారు. రూ. 4,750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం జూన్ నాటికి అందుబాటులోకి రానుంది.