CWC Meeting: ఈనెల 16న సీడబ్ల్యూసీ కీలక భేటీ.. సంస్థాగత ప్రక్షాళనతో పాటు కొత్త అధ్యక్షుడి ఎన్నికపై చర్చ

CWC Meeting: పార్టీలో అంతర్గత కలహాలు శృతిమించిన వేళ ఈనెల 16వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగనుంది.

CWC Meeting: ఈనెల 16న సీడబ్ల్యూసీ కీలక భేటీ.. సంస్థాగత ప్రక్షాళనతో పాటు కొత్త అధ్యక్షుడి ఎన్నికపై చర్చ
Congress
Follow us

|

Updated on: Oct 09, 2021 | 6:25 PM

CWC Meeting: పార్టీలో అంతర్గత కలహాలు శృతిమించిన వేళ ఈనెల 16వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగనుంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, పంజాబ్‌, చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల్లో అంతర్గత కలహాల తారాస్థాయికి చేరడంత వెంటనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జీ-23 నేతలు డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి ఈ నెల 16న భేటీ కానుంది. గత కొద్దిరోజులుగా నాయకత్వలేమితో సతమతమవుతున్న పార్టీకి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది. 16వ తేదీ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో అక్బర్‌ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ భేటీ ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు.

ఈ భేటీలో పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్‌ పరిణామాలపై ఇటీవల జీ-23 అసమ్మతి నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలను రాహుల్‌కు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పంజాబ్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు.

Read Also…. Undavalli Arun Kumar-YS Jagan: ఆంధ్రను అప్పులాంధ్రగా మార్చేశారు అంటూ జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)