Pragya Jaiswal: కరోనా బారిన కంచె బ్యూటీ.. అఖండ చిత్రయూనిట్లో గుబులు..
కరోనా సెకండ్ వేవ్ అనంతరం దాదాపు కోవిడ్ కేసులు తగ్గుముఖం పడ్డాయి. దీంతో సినిమా షూటింగ్స్... విడుదలపై ఫోకస్ పెట్టారు మేకర్స్.
కరోనా సెకండ్ వేవ్ అనంతరం దాదాపు కోవిడ్ కేసులు తగ్గుముఖం పడ్డాయి. దీంతో సినిమా షూటింగ్స్… విడుదలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇప్పటికే పలు భారీ చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతార పనులు జరుపుకుంటుండగా.. మరికొన్ని విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇక ఇప్పడిప్పుడే థియేటర్లకు రావడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందరికి షాకిచ్చింది. తాను కోవిడ్ బారిన పడినట్టు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది.
ఆదివారం జరిపిన టెస్టులలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కానీ… కరోనా సోకినట్లుగా చెప్పుకొచ్చింది ప్రగ్యా జైస్వాల్. అయితే ఈ అమ్మడు కోవిడ్ బారిన పడడం ఇది మొదటి సారి కాదని.. వ్యాక్సిన్ వేసుకోకముందు కూడా తనకు పాజిటివ్ వచ్చింది తెలిపింది. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేటేడ్ చేసుకున్నానని.. అలాగే డాక్టర్ల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలిపింది. అలాగే గత పది రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని.. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌స్టా వేదికగా చెప్పుకొచ్చింది ప్రగ్యాజైస్వాల్.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్య సరసన అఖండ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా.. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రగ్యాజైస్వాల్ కరోనా బారిన పడడంతో అఖండ చిత్రయూనిట్ ఒక్కసారిగా షాకయ్యింది. ఇటీవలే షూటింగ్లో పాల్గోన్న ప్రగ్యా జైస్వాల్ ఇలా ఆకస్మాత్తుగా కోవిడ్ బారిన పడడంతో చిత్రయూనిట్ సందేహంలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
Also Read: MAA Elections 2021: మా ఎన్నికల పోలింగ్‌లో వివాదం.. అలా అనడం నాకు నచ్చలేదు: ప్రకాశ్ రాజ్
MAA Elections 2021: మా ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్‌ను తీసుకువస్తా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీ..