Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Election: ‘మా’ ఎన్నికల చమక్కులు.. శివ బాలాజీ చేయి కొరికిన హేమ. చేయి ఎందుకు కొరికానో చెప్పాలన్న హేమ

'మా' మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లో కొంచెం సేపటి క్రితం ముగియగా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

MAA Election: 'మా' ఎన్నికల చమక్కులు.. శివ బాలాజీ చేయి కొరికిన హేమ.  చేయి ఎందుకు కొరికానో చెప్పాలన్న హేమ
Hema New
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 10, 2021 | 5:48 PM

Tollywood MAA Election: ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లో కొంచెం సేపటి క్రితం ముగియగా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 883 ఓట్లకుగాను 605 ఓట్లు పోలయ్యాయి. 60 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రాగా, మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 665 గా నమోదైంది. ఇవాళ ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. రికార్డ్‌ స్థాయిలో పోలింగ్‌ జరుగగా, మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల ప్రచారం, హామీలు ఈ సారి ఎన్నికల్లో నడవడం తెలిసిందే.

ఇక, ‘మా’ ఎలక్షన్స్ కౌంటింగ్ కొంచెం సేపటి క్రితం ప్రారంభం కాగా, ముందుగా 18 మంది కమిటీ ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. చివరగా ప్రెసిడెంట్ ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఫలితం వెలుబడేది రాత్రి 8 గంటల తర్వాతే.

ఆరోపణలు, పత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలులతో ఈ దఫా ‘మా’ ఎన్నికలు సరికొత్త సందడి చేశాయి. ప్లైట్‌ టికెట్లు బుక్‌ చేసి బయట ఉన్న నటులను ఓటింగ్‌కు రప్పించుకున్నాయి ఫ్యానల్స్‌. ఇవాళ్టి పోలింగ్ లో చమక్కులు, ఆసక్తికర సన్నివేశాలు ఇవీ..

వీల్‌ చైర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న చలపతిరావు > నిన్న అర్ధరాత్రి వరకు దూషణలకు దిగి పోలింగ్‌ బూత్‌లో కౌగిలించుకున్న సీనియర్లు > మోహన్‌బాబు – చిరంజీవి మంచి మిత్రులన్న పవన్‌ కళ్యాణ్‌ > పోలింగ్‌ బూత్‌ వద్ద మోహన్‌బాబుతో చాలా సేపు మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ > ప్రకాశ్‌రాజ్‌ విష్‌ చేసినా పట్టించుకుని బాలకృష్ణ > శివబాలాజీ చేయి కొరికిన హేమ > చేయి ఎందుకు కొరికానో చెప్పాలన్నహేమ > అజ్ఞాత వ్యక్తి చొరబాటుతో నరేశ్‌ – ప్రకాశ్‌రాజ్‌ల మధ్య వాగ్వాదం > ఫస్ట్‌ అవర్‌లోనే ఓటు హక్కు వినియోగంచుకున్న చిరు, పవన్‌, బాలయ్య > చివరి నిమిషంలో ఓటు హక్కు వినియోగించుకున్న అక్కినేని హీరోలు > ఫస్ట్‌ టైమ్‌ ఓటు హక్కు వినియోగంచుకున్న జెనిలీయ, ప్రియమణి, నిత్యామీనన్‌ > ఓటు హక్కు వినియోగించుకోని మహేశ్‌బాబు, జూ.ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌

బ్రేకింగ్ :  నిమ్స్ హాస్పిటల్లో శివ బాలాజీ.. హేమ కొరకడంతో చికిత్స కోసం నిమ్స్‌కి వెళ్లిన శివబాలాజీ

Read also: Minister Kodali Nani: పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు: కొడాలి నాని