Minister Kodali Nani: పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు: కొడాలి నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ దెబ్బకు పిచ్చెక్కిన వ్యక్తి..

Minister Kodali Nani: పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు: కొడాలి నాని
Kodali On Pawan Babu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 10, 2021 | 6:44 PM

Kodali Nani – Pawan Kalyan – Chandrababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ దెబ్బకు పిచ్చెక్కిన వ్యక్తి.. రాష్ట్రం విడిపోవడానికి కీలక సూత్రధారి.. అవినీతి చక్రవర్తి చంద్రబాబేనని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇవాళ అమరావతిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. “తాడేపల్లికి తాలిబన్కు డ్రగ్స్ కు లింక్ ఉందని టిడిపి నేతలు మాట్లాడుతున్నారు.. తాలిబన్లతో సంబందాలు పెట్టుకొని హెరిటేజ్ ద్వారా డ్రగ్స్ చంద్రబాబు.” అని నాని ఆరోపించారు.

అంతేకాదు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసే వ్యాపారాలు ఇవంటూ మంత్రి కొడాలి నాని ఇవాళ కొత్త చిట్టా విప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్.. గంజాయి రవాణా.. అవినీతి వ్యాపారాలతో చంద్రబాబు కోట్లు సంపాదించాడని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. “చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్ చెప్పాడు. డ్రగ్స్ వ్యాపారంతో చంద్రబాబు, కుటుంబ సభ్యులకు పాత్ర ఉంది. డ్రగ్స్ తీసుకునేది మీరు, డ్రగ్స్ సరఫరా చేసేది చంద్రబాబు కుటుంబ సభ్యులు.” అని నాని ఆరోపించారు.

“డ్వాక్రా సంఘాలు పెట్టింది ప్రధాని పివి నరసింహారావు. అయితే, నేను పెట్టానని చంద్రబాబు చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వ్యక్తి , వెన్నుపోటు దారుడు చంద్రబాబు. డ్రగ్స్ మత్స్యకారులు సరఫరా చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. టిడిపి నేతలకు మత్స్యకారులు దేహశుద్ధి చేయాలని చూస్తే.. పారిపోయి వచ్చారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. జగన్ పంజా దెబ్బా చూస్తారు. పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్ గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు. టిడిపి, జనసేన లను గోతిలో పాతిపెట్టే రోజు దగ్గర లోనే ఉంది. తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, కక్ష సాధింపు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కు ఎవరైనా కమ్మవారు చెప్పారా?” అని నాని ప్రశ్నించారు.

“రాష్ట్రంలో ఒక వ్యక్తి మానసిక పరిస్థితి కోల్పోయి మాట్లాడుతున్నాడు.. జగన్ దెబ్బకు పిచ్చి ఎక్కిన వ్యక్తి.. రాష్ట్రం విడిపోవడానికి వెన్నుపోటు దారుడు.. అవినీతి చక్రవర్తి.. చంద్రబాబు. జగన్ దెబ్బకు అసెంబ్లీ.. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. బద్వేలులో పారిపోయాడు. నీ కొడుకు మీద నమ్మకం ఉందా.. లోకేష్ చవట, దద్దమ్మ, దత్తపుత్రుడుని కలసి పోటీ చేద్దామని లైన్ చేస్తున్నావు. జనసేన టిడిపితో కలిసి పోవాలని అనుకుంటున్నారు. కమ్మ వారిని ఉద్దరిస్తామని చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ కమ్మ వర్గాన్ని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళేందుకు పని చేస్తాడట. టిడిపిని జనసేనలో విలీనం చేయడం మంచిది.” అని కొడాలి నాని అన్నారు.

Read also: Rain Warning: ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం