Rain Warning: ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన
ఉత్తర అండమాన్ సముద్రము.. దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు స్థిరముగా కొనసాగుతోంది.
Weather Report: ఉత్తర అండమాన్ సముద్రము.. దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు స్థిరముగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన అదే ప్రాంతంలో రాగల 36 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 4-5 రోజులలో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా ఇంకా, ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
ఫలితంగా.. పశ్చిమ, దక్షిణ తెలంగాణలో ఇప్పటికే వర్షాలు ప్రారంభం కాగా, మధ్య తెలంగాణ ప్రాంతంలో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆవర్తన ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర, సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ తెలంగాణ, ఉత్తర కర్ణాటక.. ఇంకా, దక్షిణ మహారాష్ట్రల మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 km ఎత్తు వద్ద ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.