AP Corona Cases: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్నటికి, ఇవాళ్టికి తేడా ఎంతంటే..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటికి, ఇవాళ్టికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,312 శాంపిల్స్ పరీక్షించగా..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటికి, ఇవాళ్టికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,312 శాంపిల్స్ పరీక్షించగా.. 624 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. అయితే, శనివారం నాడు మాత్రం 629 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే నిన్నటికి ఇవాళ్టికి 5 తక్కువగా నమోదు అయ్యాయన్నమాట. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 20,57,252 మంది కరోనా బారిన పడ్డారు.
గడిచిన 24 గంటల్లో 810 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో ఇప్పటి వరకు 20,35,054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా.. ఒక్క రోజులో 4 ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా చూసుకుంటే.. 14,254 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతుల్లో కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు చొప్పున ఉన్నారు. అయితే, గతం కాలంగా నమోదవుతున్న కరోనా మృతుల సంఖ్య కంటే ఇది స్వల్పమనే చెప్పాలి.
రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 9, చిత్తూరు – 87, తూర్పు గోదావరి – 151, గుంటూరు 87, కడప – 19, కృష్ణా – 51, కర్నూలు – 13, నెల్లూరు – 66, ప్రకాశం – 53, శ్రీకాకుళం – 14, విశాఖపట్నం – 30, విజయనగరం – 8, పశ్చిమ గోదావరి – 36 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు అయ్యాయి.
AP Government:
#COVIDUpdates: 10/10/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,54,358=7 పాజిటివ్ కేసు లకు గాను *20,32,159 మంది డిశ్చార్జ్ కాగా *14,254 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,944#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Y8Iu9Z86XP
— ArogyaAndhra (@ArogyaAndhra) October 10, 2021
Also read:
ashes series 2021: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఈసీబీ.. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..