Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs CSK Highlights, IPL 2021: 4 వికెట్ల తేడాతో చెన్నై విజయం.. ఉత్కంఠ మ్యాచుకు ధోని స్టైల్ ఫినిషింగ్

Venkata Chari

|

Updated on: Oct 11, 2021 | 12:24 AM

DC vs CSK Highlights in Telugu: చెన్నై నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది.

DC vs CSK Highlights, IPL 2021: 4 వికెట్ల తేడాతో చెన్నై విజయం.. ఉత్కంఠ మ్యాచుకు ధోని స్టైల్ ఫినిషింగ్
Dc Vs Csk Qualifier 1 Indian Premier League 2021

CSK vs DC, IPL 2021: హోరాహోరీగా సాగిన తొలి క్వాలిఫయర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ధోనిసేన విజయం సాధించింది. నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై ఇన్నింగ్స్‌లో రాబిన్ ఊతప్ప(63 పరుగులు, 44 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్సులు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడి తన టీంను గెలిపించాడు. కీలకమైన క్వాలిఫయర్ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీ షా(60), రిషబ్ పంత్(51), హెట్ మెయిర్(37)లు ఢిల్లీ టింను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు.

ఐపీఎల్ 2021 మొదటి క్వాలిఫయర్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. దుబాయ్‌లో జరగబోయే మ్యాచ్‌లో, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే టీం అనుభవం ఉన్న ఆటగాళ్లను కలిగి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ జట్టు 20 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడమే అందుకు ఉదాహరణ. అది వారి ప్రదర్శనలో స్థిరత్వాన్ని చూపుస్తోంది. కోవిడ్ -19 కారణంగా టోర్నమెంట్ మధ్యలోనే వాయిదా పడినప్పటికీ ఢిల్లీ తన స్థిరత్వాన్ని కొనసాగించింది. గతేడాది ప్లేఆఫ్ చేరుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స టీం.. ఈ ఏడాది ప్లేఆఫ్‌కి చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన (ప్రస్తుతం కలిపి) 14 ఐపీఎల్‌లలో చెన్నై టీం 11 సార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే దుబయ్‌లో జరిగిన రెండో దశలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది.

మొదటి క్వాలిఫయర్‌లో, మూడుసార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది కానీ ఓడిపోయిన జట్టు మరో మ్యాచ్ ఆడనుంది. రెండవ క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 15 సార్లు చెన్నై జట్టు విజయం సాధించడంలో విజయం సాధించింది. అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ వాటా 10 మ్యాచ్‌లలో గెలిచింది.

ప్లేయింగ్ ఎలెవన్ అంచనా: ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రిపాల్ పటేల్/మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేశ్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేష్ రైనా, MS ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Oct 2021 11:23 PM (IST)

    ధోని స్టైల్ ఫినిషింగ్

    చెన్నై నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది.

  • 10 Oct 2021 11:13 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    టామ్ కర్రన్ బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. 19.1వ ఓవర్‌లో అలీ (16) రబాడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 11:07 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    అవేష్ ఖాన్ బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. 18.1వ ఓవర్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (70 పరుగులు, 50 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు) అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 10:51 PM (IST)

    మంచువిష్ణు విజయం

    మంచువిష్ణు విజయం సాధించారని అధికారికంగా ప్రకటించిన ఎన్నికల అధికారి..

  • 10 Oct 2021 10:48 PM (IST)

    ఉత్తేజ్ గెలుపు..

    జాయింట్ సెక్రెటరీగా పోటీ పడిన కరాటే కళ్యాణి పై నటుడు ఉత్తేజ్ గెలుపొందారు..

  • 10 Oct 2021 10:47 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    రబాడా బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 14.4వ ఓవర్‌లో అంబటి రాయుడు (1) శ్రేయాస్ అయ్యర్‌ అద్భుత త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు.

  • 10 Oct 2021 10:42 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    టామ్ కర్రాన్ బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. 13.6వ ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్ (0) శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 10:41 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    టామ్ కర్రాన్ బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. 13.3వ ఓవర్‌లో రాబిన్ ఊతప్ప (63) శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 10:17 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన రాబిన్ ఊతప్ప

    కేవలం 35 బంతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప 145 స్ట్రైక్‌ రేట్‌తో అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

  • 10 Oct 2021 10:12 PM (IST)

    9 ఓవర్లకు చెన్నై స్కోర్ 75/1

    9 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. క్రీజులో ఊతప్ప 47, గైక్వాడ్ 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Oct 2021 09:58 PM (IST)

    6 ఓవర్లకు చెన్నై స్కోర్ 59/1

    6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. క్రీజులో ఊతప్ప 40, గైక్వాడ్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లో అవేష్ ఖాన్‌ బౌలింగ్‌లో ఊతప్ప రెండు ఫోర్లు, రెండు సిక్సులతో మొత్తం 20 పరుగులు రాబట్టుకున్నాడు.

  • 10 Oct 2021 09:49 PM (IST)

    4 ఓవర్లకు చెన్నై స్కోర్ 34/1

    4 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. క్రీజులో ఊతప్ప 19, గైక్వాడ్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Oct 2021 09:44 PM (IST)

    దుబాయ్‌లో అత్యధిక ఛేజ్‌లు

    166 PBKS vs KKR 165 SRH vs RR 165 RCB vs DC 150 RCB vs RR

  • 10 Oct 2021 09:34 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    అన్రిచ్ నార్ట్జే బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం మొదటి ఓవర్‌లో తొలి వికెట్‌ను కోల్పోయింది. 0.5వ ఓవర్‌లో డుప్లెసిస్ (1) బౌల్డయ్యాడు.

  • 10 Oct 2021 09:31 PM (IST)

    చెన్నై టార్గెట్ 173

    ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 10 Oct 2021 09:07 PM (IST)

    ఐదో వికెట్‌గా హెట్ మెయిర్

    డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. 18.4వ ఓవర్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి హెట్ మెయిర్(37 పరుగులు, 24 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్సు) పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 08:48 PM (IST)

    16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 128/4

    16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. క్రీజులో పంత్ 22, హెట్ మెయిర్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Oct 2021 08:33 PM (IST)

    13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 96/4

    13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. క్రీజులో పంత్ 9, హెట్ మెయిర్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Oct 2021 08:22 PM (IST)

    నాలుగో వికెట్‌గా పృథ్వీ షా

    జడేజా బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయియింది. 10.2వ ఓవర్‌లో డు ప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా(60 పరుగులు, 34 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు) పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 08:18 PM (IST)

    మూడో వికెట్‌గా అక్షర్ పటేల్

    మొయిన్ అలీ బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయియింది. 9.4వ ఓవర్‌లో సాట్నర్‌కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్(11) పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 08:11 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన పృథ్వీ షా

    కేవలం 27 బంతుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఓపెనర్ పృథ్వీ షా 190 స్ట్రైక్‌ రేట్‌తో తన తొలి అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

  • 10 Oct 2021 08:00 PM (IST)

    రెండో వికెట్‌గా శ్రేయాస్ అయ్యర్

    హజల్‌వుడ్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీంను దెబ్బ తీశాడు. 5.3వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్(1) గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 07:56 PM (IST)

    50 పరుగులకు చేరిన ఢిల్లీ

    కేవలం 4.5 ఓవర్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 50 పరుగులకు చేరింది. పృథ్వీ షా 233 స్ట్రైక్‌ రేట్‌తో ఢిల్లీ స్కోర్ బోర్డును ఉరకలెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు షా 5 ఫోర్లు, 3 సిక్సులు బాదేశాడు.

  • 10 Oct 2021 07:49 PM (IST)

    తొలి వికెట్‌గా శిఖర్ ధావన్

    హజల్‌వుడ్ వేసిన 4వ ఓవర్‌లో ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(7) ధోనికి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

  • 10 Oct 2021 07:46 PM (IST)

    మూడు ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 32/0

    మూడు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష్ట పోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 3, పృథ్వీ షా 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక మూడో ఓవర్లో పృథ్వీ షా 208 స్ట్రైక్‌ రేట్‌తో వరుసగా నాలుగు బౌండరీలు బాదేశాడు.

  • 10 Oct 2021 07:41 PM (IST)

    తొలి సిక్స్

    రెండో ఓవర్లలో హజల్‌వుడ్ బౌలింగ్‌లో పృథ్వీ షా మరోసారి కీపర్ పై నుంచి ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ను బాదేశాడు. దీంతో రెండు ఒవర్లు ముగిసే వరకు ఢిల్లీ టీం వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.

  • 10 Oct 2021 07:39 PM (IST)

    తొలి బౌండరీ

    రెండో ఓవర్లలో హజల్‌వుడ్ బౌలింగ్‌లో పృథ్వీ షా కీపర్ పై నుంచి ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీని బాదేశాడు.

  • 10 Oct 2021 07:32 PM (IST)

    మొదలైన ఢిల్లీ బ్యాటింగ్

    తొలి క్వాలిఫయర్‌లో టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగారు.

  • 10 Oct 2021 07:30 PM (IST)

    మీకు తెలుసా?

    ** 24 సంవత్సరాల ఆరు రోజుల వయసులో రిషబ్ పంత్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో నాయకత్వం వహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు ** ఎంఎస్ ధోని, రాహుల్ ద్రవిడ్ (2013 లో) తర్వాత ఐపీఎల్ ప్లే-ఆఫ్స్‌లో రెండవ అతి పెద్ద కెప్టెన్‌గా నిలిచాడు. ** సీఎస్‌కే ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో ఛేజ్ చేసి, ఐదింట్లోనూ గెలిచింది. ** దుబాయ్‌లో చివరి ఏడు ఆటలలో చేజింగ్ చేసిన జట్టే గెలిచింది.

  • 10 Oct 2021 07:12 PM (IST)

    CSK vs DC: ప్లేయింగ్ ఎలెవన్

    ప్లేయింగ్ ఎలెవన్: ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (కీపర్&కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడా, టామ్ కర్రాన్, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

    చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కీపర్&కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

  • 10 Oct 2021 07:10 PM (IST)

    టాస్ గెలిచిన ధోని సేన

    ఫైనల్‌కు చేరే మ్యాచులో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.

  • 10 Oct 2021 06:35 PM (IST)

    గెలిస్తే ఫైనల్.. ఓడితే మరో అవకాశం

    మొదటి క్వాలిఫయర్‌లో, మూడుసార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది కానీ ఓడిపోయిన జట్టు మరో మ్యాచ్ ఆడనుంది. రెండవ క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.

  • 10 Oct 2021 06:34 PM (IST)

    DC vs CSK: హెడ్ టూ హెడ్

    ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 15 సార్లు చెన్నై జట్టు విజయం సాధించడంలో విజయం సాధించింది. అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ వాటా 10 మ్యాచ్‌లలో గెలిచింది.

  • 10 Oct 2021 06:34 PM (IST)

    తొలి క్వాలిఫయర్‌కు సిద్ధమైన దుబాయ్

Published On - Oct 10,2021 6:30 PM

Follow us