DC vs CSK, IPL 2021: ధోని సేన టార్గెట్ 173.. పృథ్వీ ‘షో’కు తోడైన ఢిల్లీ కెప్టెన్ పంత్.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న యంగ్ ప్లేయర్స్
DC vs CSK: ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
CSK vs DC, IPL 2021: కీలకమైన క్వాలిఫయర్ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీ షా(60), రిషబ్ పంత్(51), హెట్ మెయిర్(37)లు ఢిలీ టింను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు.
ఈ మ్యాచులో శిఖర్ ధావన్(7) తక్కువ పరుగులకే హజల్ వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా (1) వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో 50 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రెండో ఓవర్ నుంచి చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. కేవలం 27 బంతుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఓపెనర్ పృథ్వీ షా 176 స్ట్రైక్ రేట్‌తో తన తొలి అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అయితే మరో ఎండ్‌లో ఆడుతోన్న అక్షర్ పటేల్ (11) మొయిన్ అలీ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 9.4వ ఓవర్‌లో సాట్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం నాలుగో వికెట్‌గా పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. 4 వికెట్ల తరువాత ఢిల్లీ టీం రిషబ్ పంత్(51 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు), హెట్ మెయిర్(37 పరుగులు, 24 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) కీలకమైన అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించి ఢిల్లీ టీం భారీ స్కోర్ సాధించేందుకు సహాపడ్డారు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు తొలి భాగంలో ఆకట్టుకున్నా తరువాత వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డారు. హజల్ వుడ్ 2, జడేజా, అలీ, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.
మొదటి క్వాలిఫయర్‌లో, మూడుసార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది కానీ ఓడిపోయిన జట్టు మరో మ్యాచ్ ఆడనుంది. రెండవ క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 15 సార్లు చెన్నై జట్టు విజయం సాధించడంలో విజయం సాధించింది. అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ వాటా 10 మ్యాచ్‌లలో గెలిచింది.
ప్లేయింగ్ ఎలెవన్: ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (కీపర్&కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడా, టామ్ కర్రాన్, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కీపర్&కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
ashes series 2021: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఈసీబీ.. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..