Konam Fish: గంగపుత్రుల పంట పండింది.. వేటకు వెళ్లిన అందరి వలల్లో లక్షలాది రూపాయల విలువచేసే అరుదైన కోనాం చేపలు
సిక్కోలు తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేపల పంట పండింది. వేటకు వెళ్లిన ప్రతి ఒక్క మత్స్యకారుడి వలకు లక్షల రూపాయలు విలువ చేసే
Fish Hunting – Srikakulam District – Konam Fish: సిక్కోలు తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేపల పంట పండింది. వేటకు వెళ్లిన ప్రతి ఒక్క మత్స్యకారుడి వలకు లక్షల రూపాయలు విలువ చేసే చేపల్లో రారాజుగా చెప్పుకునే కోనాం చేపలు వలకు చిక్కడంతో ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కళ్లు చెదిరే చేపలు దర్శనం ఇచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడ కుప్పలు తెప్పలుగా పోగులు వేసి వున్న ఈ పొడుగైన చేపలు చూస్తుంటే మార్కెట్ లో విక్రయానికి పేర్చినట్లు వున్నాయి కదా? అలా అనుకుంటే పొరపాటే.. ఇంత పెద్ద మొత్తంలో చేపల వేట ఈ రోజు శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, ఏకువూరు రేవులో చేపల వేట కు వెళ్లిన మత్స్యకారులకు ఇంత పెద్ద మొత్తంలో చేపల పంట పడింది.
చాలా రోజులు తరువాత కొనాం చేపలు ఇంత పెద్ద మొత్తంలో చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయని మత్స్యకారులు అంటున్నారు. ఇలా ఈ రోజు వేటకు వెళ్లిన అందరి మత్స్యకారులకు పడిన ఈ కోనాం చేపల ఖరీదు సుమారు 50 లక్షలు విలువ చేస్తుందని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో చేపల వలకు చిక్కిందన్న ఆనందం కంటే, పట్టు బడిన ఈ చేపలు అమ్ముడు పోవడం లేదన్న దిగులు తమను వెంటాడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేట ఫలించినా, ఆ చేపలకు తగిన గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ నిల్వ చేసి అమ్ముకునేందుకు తగిన కోల్డు స్టోరేజ్ సౌకర్యం లేక పోవడంతో కోనాం చేప కిలో ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల ధర పలుకుతున్న ఈ రోజుల్లో ఈ రోజు దొరికిన చేపలను కిలో నాలుగు వందలకు తెగనమ్ముకోవాల్సి వచ్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Rahul – Priyanka: రైతుల హత్య, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ