EBID Scam: మెడలో అరకిలోకి తగ్గకుండా గోల్డ్.. చుట్టూ బౌన్సర్లు.. కాస్ట్లీ కార్లతో ఒక డాన్‌లా కటింగ్.. కట్ చేస్తే.!

కడియాల సునీల్ అలియాస్ డాన్ సునీల్. మెడలో అరకిలోకి తగ్గకుండా బంగారం. చుట్టూ బౌన్సర్లు. కాస్ట్లీ కార్లతో దాదాపు రెండు మూడేళ్లు ఒక డాన్ లా బతికిన సునీల్

EBID Scam: మెడలో అరకిలోకి తగ్గకుండా గోల్డ్.. చుట్టూ బౌన్సర్లు.. కాస్ట్లీ కార్లతో ఒక డాన్‌లా కటింగ్.. కట్ చేస్తే.!
Ebidd

Anantapuram EBID Scam: కడియాల సునీల్ అలియాస్ డాన్ సునీల్. మెడలో అరకిలోకి తగ్గకుండా బంగారం. చుట్టూ బౌన్సర్లు. కాస్ట్లీ కార్లతో దాదాపు రెండు మూడేళ్లు ఒక డాన్ లా బతికిన సునీల్ ప్రస్తుతం అనంతపురం జిల్లా జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు. అసలు ఎవరు ఈ సునీల్.? ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కుమారుడిగా ప్రస్థానం మొదలు పెట్టి ఈబిడ్ అనే ఫైనాన్స్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో కొందరు నమ్మకమైన ఏజెంట్లను నియమించుకున్నాడు. అంతే కాదు ముందుగా తనకు తాను ఒక డబ్బున్న వ్యక్తిగా కనిపించేందుకు ఇలాంటి ఆడంబరాలు ఏర్పాటు చేసుకున్నాడు. లక్షకు 30 వేల రూపాయలు వడ్డీ ఇస్తానంటూ ముందుగా బంధువులు తెలిసిన వారితో వ్యాపారం ప్రారంభించాడు. ఇలా వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూళ్లుచేసిన సునీల్ ఒక ఫైన్ డే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అనంతపురం, కడప, కర్నూలు ఇలా అక్కడ ఇక్కడా తేడా లేదు. అన్ని చోట్లా అన్ని వర్గాల వారిని నిలువునా ముంచాడు సునీల్. ఈబిడ్ స్కామ్ పేరుతో లక్షకు 30వేలు వడ్డీ ఇస్తామంటూ.. ఎంతో మంది ఆశ చూపి మోసం చేసిన సునీల్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సునీల్ బాధితుల్లో రాయలసీమ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. తాజాగా మరోసారి సునీల్ ను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అసలు సునీల్ భార్యను ఎందుకు అరెస్టు చేశారు.

అయితే, సునీల్ ను సీఐడీ పోలీసులు అతి కష్టం మీద అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు రిమాండ్ కు తరలించడం సునీల్ ని విచారించేందుకు పోలీస్ కస్టడీ తీసుకున్నారు. సునీల్ పోలీసులు విచారణలో ఎలాంటి అంశాలు చెప్పాడన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. సునీల్ జీవితం ఎంతో విలాసవంతంగా ఉండటంతో పాటు కొన్ని చర్చీలకు డబ్బుసైతం సాయం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈబిడ్ బిజినెస్ లో కొందరు ఫాస్టర్లు సునీల్ కు నమ్మకమైన వారిద్వారా పెట్టుబడిదారులను గుర్తించి వ్యాపారాన్ని విసృతం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

తాడిపత్రి పట్టణానికి చెందిన ఒక ప్రముఖ పాస్టర్, డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా లక్షలాది రూపాయలు డిపాజిట్ చేయించారు. అతని ద్వారా పులివెందులకు చెందిన, క్రైస్తవ వర్గాల్లో ప్రజాధరణ కలిగిన మరో వ్యక్తి ద్వారా 25 కోట్ల దాకా డిపాజిట్లు చేయించాడు. అనంతపురం నగరంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్డులో కార్యాయాన్ని తెరచి ఆర్ధికలావాదేవీలు జరిపాడు. అయితే మోసపోయిన బాధితులు వచ్చిన సమయంలో వారిని బౌన్సర్ల ద్వారా బెదిరించినట్లు తెలుస్తోంది.

సునీల్ వారిని వీరిని అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఈ బిజినెస్ లోకి దింపినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిలో ఫాస్టర్లు, రాజకీయ నాయకుల అనుచరులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులు ఉన్నారు. మరోవైపు ఈ వ్యాపారంలో సునీల్ భార్య స్రవంతిబాయి ది కూడా కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా కోట్లలో వసూళ్లు చేసినట్లు ఆధారలు ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా వన్ టౌన్ పోలీసులు కూడా సునీల్ ను ఒక్కరోజు కస్టడీకి తీసుకుని విచారించారు. సునీల్ ఆస్తులను కొందరు బెదిరించి లాక్కున్నట్టు తెలుస్తోంది. మరికొంత డబ్బు నాగపూర్ పోలీసులకు సరెండర్ చేసినట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో బాధితులకు సునీల్ డబ్బు చెల్లించాలంటే వందలకోట్లు ఉండాలి. మరి సునీల్ దగ్గర అంత డబ్బు ఉందా.. బంధువుల పేరు మీద ఆస్తులు ఉంచాడా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Read also: Minister Kodali Nani: పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు: కొడాలి నాని

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu