Viral News: పిచ్చి పీక్స్‌కి వెళ్లడం ఇంటే ఇదే మరి!.. ఈ అమ్మాయికి ఆ లుక్‌లో కనిపించడం అంటే చాలా ఇష్టమట!

Viral News: ప్రపంచంలో ఏడు వింతలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వింతల మాదిరిగానే భూమిపై వింత మనుషులు కూడా ఉన్నారు. వారి ప్రవర్తన గురించి చెప్పుకుంటే..

Viral News: పిచ్చి పీక్స్‌కి వెళ్లడం ఇంటే ఇదే మరి!.. ఈ అమ్మాయికి ఆ లుక్‌లో కనిపించడం అంటే చాలా ఇష్టమట!
Girl
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 10, 2021 | 7:42 PM

Viral News: ప్రపంచంలో ఏడు వింతలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వింతల మాదిరిగానే భూమిపై వింత మనుషులు కూడా ఉన్నారు. వారి ప్రవర్తన గురించి చెప్పుకుంటే.. కొందరి వ్యవహారశైలి ఫన్నీగా ఉంటే.. మరికొందరి వ్యవహార శైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొందరి తీరు భయానకంగా ఉంటాయి. అయితే, తాజాగా ఓ అమ్మాయి వింత ప్రవర్తనకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. సాధారణంగా అమ్మాయిలు అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ఇష్టపడుతారు. అందుకోసం వేల వేలు ఖర్చు పెడతారు కూడా. అయితే, ఈ అమ్మాయి మాత్రం పూర్తి భిన్నం. ఆకర్షణీయంగా కనిపించడం తనకు చెడ్డ చిరాకు. ఎంత అగ్లీగా కనిపిస్తే.. అంత ఆనందం ఆమెకు. అవునండీ బాబూ.. ఆ అమ్మాయి కోరికలు బహు విచిత్రం మరి. ఇంతకీ.. ఆ అమ్మాయి ఎవరు? ఆమె కోరిక ఏంటి? ఆమె ఆసక్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

25 ఏళ్ల షైనీ.. ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొంది. అయితే, మేకప్ ఆర్టిస్టులు ఆమెను అందంగా తయారు చేశారు. ఆమె శరీరంపై ఉన్న టాటూలు అన్నీ కవర్ చేసి.. దేవ కన్యలా మార్చారు. కానీ, ఆ మేకోవర్ షైనీకి అస్సలు నచ్చలేదు. చల్ హట్.. ఇదేం మేకప్.. అస్సలు నచ్చలేదు అంటూ ఈసడించుకుంది. అయితే, ఇంత అందంగా తీర్చిదిద్దినా తనకు నచ్చకపోవడానికి అసలు కారణం వేరే ఉందట. ఆ అమ్మాయికి అందంగా కనిపించడం కానీ, సాధారణ అమ్మాయిలా కనిపించడం కానీ అస్సలు నచ్చదట. తనను చూస్తే జనాలు భయపడాలని, అలా ఉండటం అంటేనే తనకు ఇష్టం అని చెబుతోంది షైనీ. అందుకే తాను ఒక మంత్రగత్తెలా, దెయ్యం గెటప్‌లో ఉండటానికి ఆసక్తి కనబరుస్తుంది. ఈ నేపథ్యంలో తన రూపాన్నే మార్చేసుకుంది. శరీరం నిండా టాటూలు వేయించుకుంది. చెవులను కుట్టించుకుంది. మంత్రగెత్తె లుక్ కోసం తన కళ్ల రూపు రేకలనే మార్చే ప్రయత్నం చేసింది. ప్రజలను తనను చూసి భయపడుతుందటే.. ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుందని షైనీ చెప్పుకొచ్చింది.

Devil Woman

Devil Woman

అయితే, టీవీ షో లో పాల్గొన్న షైనీని.. మెకప్ ఆర్టిస్ట్‌లు అద్భుతంగా మేకోవర్ చేశారు. ఆమె శరీరంలో ఉన్న 20 టాటూలను కవర్ చేయడానికి గంటలు, గంటలు కష్టపడ్డారు. అంతేకాదు.. షైనీ శరీరంపై మొత్తం 10 కుట్లు ఉన్నాయని, వాటిని కవర్ చేస్తూ షైనీని మేకోవర్ చేయడానికి మేకప్ ఆర్టిస్టులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని టీవీ షో నిర్వాహకులు తెలిపారు. ఇంత కష్టపడి మేకోవర్ చేస్తే.. చివరకు తనను తాను చూసుకుని హడలిపోయింది షైనీ. ‘నా సాధారణ రూపాన్ని చూసి నేను చాలా భయపడ్డాను. ఫ్యూచర్‌లో ఇలాంటి మేకోవర్ అస్సలు చేసుకోను.’ అని కుండబద్దలు కొట్టింది షైనీ. అయితే, షైనీ ఇలా ఉంటేనే బాగుందని, భవిష్యత్‌లోనూ ఇంతే అందంగా ఉండాలని ప్రజలను ఆమెను కోరారు. కానీ, షైనీ మాత్రం నా వల్ల అస్సలు కాదంటూ తేల్చి చెప్పేసింది.

Also read:

Tirumala Brahmotsavam 2021: రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ..

EBID Scam: మెడలో అరకిలోకి తగ్గకుండా గోల్డ్.. చుట్టూ బౌన్సర్లు.. కాస్ట్లీ కార్లతో ఒక డాన్‌లా కటింగ్.. కట్ చేస్తే.!

MAA Elections Counting: క్షణక్షణానికి మారుతోన్న లీడ్స్.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి నలుగురు గెలుపు