Russian plane crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిన విమానం.. 16 మంది మృతి..
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆరుగురు గాయపడగా వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు...
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆరుగురు గాయపడగా వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం రష్యాకు చెందిన L-410 విమానం 22 మందితో వెళ్తున్న క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:23 గంటల సమయంలో టాటర్‌స్టాన్ రిపబ్లిక్ మీదుగా ప్రయాణించే సమయంలో కూలిపోయిందని ఆ దేశ మంత్రిత్వ శాఖ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారని పేర్కొంది. ఈ విమానం వాలంటరీ సొసైటీ ఫర్ అసిస్టెన్స్ ఫర్ ఆర్మీ, ఏవియేషన్, నేవీ ఆఫ్ రష్యాకు చెందినది.
చెక్ నిర్మించిన L-410 తేలికపాటి విమానం క్లబ్ ఉపయోగించే రెండు విమానాలలో ఒకటి అని తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలో రష్యాలో రెండు L-410 విమానాలు ఘోరమైన ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది మరణించారు. రష్యా విమాన ప్రమాదాలతో అపఖ్యాతి పాలైంది. అయితే ఇటీవలి కాలంలో సోవియట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ఆధునిక జెట్‌కు ప్రధాన విమానయాన సంస్థలు మారడంతో ఎయిర్ ట్రాఫిక్ భద్రతను మెరుగుపరుచకున్నారు. కానీ విమాన నిర్వహణ సరిగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇప్పటికీ దూర ప్రాంతాల్లో తేలికపాటి విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
Avião IghtLight L- 410 com 20 paraquedistas e 2 tripulantes caiu no Tartaristão, Rússia. pic.twitter.com/mVoMJXcpbo
— JOÃO (@Joo00556315) October 10, 2021