Viral Video: ఆస్పత్రిలో స్టెప్పులేసిన బుడ్డొడు.. సోషల్ మీడియాలో వైరలైన వీడియో..

మనం ఆస్పత్రికి ఎందుకు వెళ్తాం.. ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు అక్కడి వెళ్తాం. అయితే చాలా మందికి ఆస్పత్రికి వెళ్లడం అంటే భయం ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే టెస్టులు చేస్తారు, ఇంజక్షన్లు వేస్తారని ఆందోళన చెందుతారు...

Viral Video: ఆస్పత్రిలో స్టెప్పులేసిన బుడ్డొడు.. సోషల్ మీడియాలో వైరలైన వీడియో..
Viral
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 10, 2021 | 3:52 PM

మనం ఆస్పత్రికి ఎందుకు వెళ్తాం.. ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు అక్కడి వెళ్తాం. అయితే చాలా మందికి ఆస్పత్రికి వెళ్లడం అంటే భయం ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే టెస్టులు చేస్తారు, ఇంజక్షన్లు వేస్తారని ఆందోళన చెందుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే మరి ఎక్కువగా భయపడతారు. కానీ ఓ ఆస్పత్రిలో చేరిన చిన్నోడు ఆనందంగా స్టెప్పులు వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్‎లోని ఓ ఆస్పత్రిలో మిగ్యుల్ అనే పిల్లాడు తన అభిమాన పాటను ఆస్వాదిస్తూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. టీవీలో ఓ సింగర్ మైక్ పట్టుకుని పాడిన పాటను విన్న పాప తన చేతిలోని చెంచాను మైక్ లాగా పట్టుకుని పాట పడుతూ డ్యాన్స్ చేశాడు. మిగ్యుల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ కోసం ఆస్పత్రిలో చేరారు. కానీ అతనిలో భయం ఏ మాత్రం కనిపించలేదు.

కష్ట సమయాల్లో కూడా జీవితాన్ని ఆస్వాదించడంలో ఈ బాబు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాడు. మంచి సంగీతం వింటే మనసు కుదుట పడుతుందని చూపించగలిగాడు. మిగ్యుల్ గత వారం గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో ఆసుపత్రిలో చేరాడు.. కానీ అతనికి ఇష్టమైన పాట టీవీలో వచ్చినప్పుడు అది పాడకుండా, డ్యాన్స్ చేయకుండా మిగ్యుల్ ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఈ అందమైన కుర్రాడి వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి 6,000 వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిగ్యుల్ ఇంటర్నెట్‌లో హృదయాలను గెలుచుకున్నాడు.”విలువైన అబ్బాయి,” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ “సంగీతం అన్నింటిని నయం చేస్తుందని.” రాసుకొచ్చారు.

Read Also..  Viral News: బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని పెళ్లాడిన యువతి.. ఎందుకో తెలిస్తే మీరూ ప్రశంసిస్తారు..