AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని పెళ్లాడిన యువతి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటారు. అయితే ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలకు సంబంధించిన వీడియోలు...

Viral News: బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని పెళ్లాడిన యువతి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
Marriage
Ravi Kiran
|

Updated on: Oct 10, 2021 | 4:04 PM

Share

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటారు. అయితే ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలకు సంబంధించిన వీడియోలు, వార్తలు తరచూ సోషల్ మీడియాలో చూసే ఉంటాం. రియల్ లైఫ్‌లో ఇలాంటి త్యాగాలు తక్కువే అయినా.. ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓ యువతి తన ప్రేమికుడి కోసం గొప్ప త్యాగం చేయాలనుకుంది. ఇంతకీ అదేంటో చూసేద్దాం పదండి.!

తన బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందో వివరిస్తూ.. ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌కి తల్లి మరణించిందని.. అతడు బాధపడటం తాను చూడలేకపోతున్నానని ఆ మహిళ వివరించింది. ఇలాంటి కష్ట సమయాల్లో అతడికి ఎలప్పుడూ మద్దతుగా నిలుస్తానని.. సంతోషం కోసం ఏదైనా చేస్తానని టిక్‌టాక్ యూజర్ @ys.amri తన అకౌంట్‌లో చెప్పుకొచ్చింది. ఈ వార్త చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవచ్చు. ఆమె అకస్మాత్తుగా ఎందుకని తన బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని పెళ్లాడిందో మీరు ఎవరైనా ఊహించగలిగారా.? ఎందుకంటే తద్వారా ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కి తల్లిని ఇవ్వాలనుకుంది.

ఆమె బాయ్‌ఫ్రెండ్ తల్లి మరణించడంతో.. అతడు తీవ్రంగా కృంగిపోయాడు. ఇక అతడి బాధను చూడలేకపోయిన ఆ యువతి ఎవరూ ఊహించనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. భార్య కావాల్సిన ఆ అమ్మాయి.. అతడికి అమ్మగా మారాలని నిర్ణయించుకుంది. అతడికి తల్లి లేని లోటును తీర్చడానికి అతని తండ్రిని వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. ఇక ఈ నిర్ణయం తీసుకున్న ఆమెను కొందరు మెచ్చుకుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.