AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Volcano: అగ్నిపర్వతం విస్ఫోటనం.. మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి వచ్చిన లావా..

స్పానిష్ ద్వీపమైన లా పాల్మా ద్వీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన మూడు వారాల తర్వాత ఆదివారం భూకంపం వచ్చింది. దీంతో మూడు అంతస్థుల భవనాల వరకు లావా వచ్చింది...

Volcano: అగ్నిపర్వతం విస్ఫోటనం.. మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి వచ్చిన లావా..
Lava
Srinivas Chekkilla
|

Updated on: Oct 10, 2021 | 9:08 PM

Share

స్పానిష్ ద్వీపమైన లా పాల్మా ద్వీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన మూడు వారాల తర్వాత ఆదివారం భూకంపం వచ్చింది. దీంతో మూడు అంతస్థుల భవనాల వరకు లావా వచ్చింది. ఆదివారం సంభవించిన భూకంప తీవ్రత రీక్టర్ స్కేల్‎పై 3.8 గా నమోదయిందని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ (ING) తెలిపింది. మాజో, ఫ్యూన్కాలియంట్. ఎల్ పాసో గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు తెలిపింది. కుంబ్రే వైజా అగ్నిపర్వతం వైపు ఎర్రటి వేడి శిలాద్రవం ప్రవహిస్తుంది. అది భవనాల వైపు వచ్చినట్లు స్పానిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ తెలిపింది. సోమవారం నుంచి స్పానిష్ నావికాదళం అగ్నిపర్వత బూడిదను శుభ్రం చేయడంలో సహాయపడుతున్నారని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీట రోబల్స్ చెప్పారు.

లావా వేడి 1,240 డిగ్రీల సెల్సియస్ (2,264 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలతో టోడోక్ గ్రామం శివారులో ఉన్న కొన్ని భవనాలను ధ్వంసం చేసిందని కానరీ దీవుల అగ్నిపర్వత సంస్థ ట్విట్టర్‌లో తెలిపింది. అగ్నిపర్వతం సమీపంలో పాక్షిక కోన్ కూలిపోయిందని ING ప్రతినిధి స్టావ్రోస్ మెలెట్లిడిస్ రాయిటర్స్‌తో అన్నారు. “కుంబ్రే వీజా అగ్నిపర్వతం యొక్క ఉత్తర పై భాగం కూలిపోవడం వల్ల పెద్ద మొత్తంలో లావా వచ్చిందని స్పెయిన్ జాతీయ భద్రతా విభాగం ట్వీట్ చేసింది.

లావా “లామా క్యామినో డి లా గటా ఇండస్ట్రియల్ ఎస్టేట్,కొత్త భవనాలకు చేరుకుంది.” సెప్టెంబర్ 19 న విస్ఫోటనం అయినప్పటి నుండి లావా నదులు 1,186 భవనాలను ధ్వంసం చేశాయని కానరీ దీవుల అగ్నిపర్వత అత్యవసర ప్రణాళిక (పెవోల్కా) సంస్థ యొక్క సాంకేతిక డైరెక్టర్ మిగ్యుల్ ఏంజెల్ మోర్‌క్యూండే అన్నారు. దాదాపు 83,000 మంది నివాసితులు ఉన్న లా పాల్మాలో దాదాపు 6,000 మందిని వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. శనివారం తెల్లవారుజామున విస్ఫోటనం సమీపంలో మెరుపు కనిపించింది. జ్యోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ 2016 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో మెరుపులు ఉత్పన్నమవుతాయని కనుగొన్నారు.

Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు