AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: జంక్‌ ఫుడ్‌కు అడిక్ట్ అయ్యారా? అయితే ఈ 5 చిట్కాలను పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి..

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా సమయపాలన లేకుండా ఫుడ్ తినడం, జంక్ ఫుడ్‌కి అలవాటు పడటం వల్ల విపరీతంగా..

Health: జంక్‌ ఫుడ్‌కు అడిక్ట్ అయ్యారా? అయితే ఈ 5 చిట్కాలను పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి..
Junk Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 10, 2021 | 8:53 PM

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా సమయపాలన లేకుండా ఫుడ్ తినడం, జంక్ ఫుడ్‌కి అలవాటు పడటం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. దాంతో వివిధ రోగాలు పలకరించడంతో పాటు.. ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో జనాల్లో ఆరోగ్యం పట్ల అవేర్ నెస్ వస్తోంది. అనారోగ్యానికి కారణమైన అధిక బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, బరువు తగ్గించుకోవాలనుకునేవారు ముఖ్యంగా తమ కోరికలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. డైటింగ్, రెగ్యులర్ జిమ్ చేస్తున్నప్పటికీ.. స్ట్రీట్ ఫుడ్‌, జంక్ ఫుడ్ తినకుండా నియంత్రించుకోలేని వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఫలితంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. మరి జంక్ ఫుడ్ తినకుండా ఉండేందుకు 5 చిట్కాలు పాటించాలని డైట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఆ 5 చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పార్టీలకు వెళ్తే ముందుగా ఏం తినాలంటే.. జంక్ ఫుడ్ నివారించడానికి ముందుగా మీరు మీ కడుపును ఖాళీ ఉంచకుండా చూడండి. మీ కడుపు నిండినట్లుగా అనిపిస్తే ఆకలి అనిపించదు. ఫలితంగా జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు. అయితే, పార్టీ లేదా డిన్నర్‌కు వెళ్లినప్పుడు ముందుగా హెల్తీ ఫుడ్‌నే తినాలి. అలా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండొచ్చు.

ప్రోటీన్స్ అధికంగా ఉండే ఫుడ్‌నే తినాలి.. మీకు ఏదైనా తినాలనిపిస్తే.. ముందుగా ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఫుడ్‌ను తినడం ద్వారా.. కడుపు నిండినట్లుగా అనిపిస్తుంటుంది. అలా జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండొచ్చు.

మద్యం సేవించవద్దు.. బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా మద్యం సేవించడం మానుకోవాలి. ఆల్కహాల్ మీ కష్టాన్నంతా వృథా చేస్తుంది. మద్యానికి బదులుగా నీళ్లు, జ్యూస్, నిమ్మరసం లాంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. తద్వారా మద్యం అలవాటును క్రమంగా కంట్రోల్ చేయొచ్చు.

ఫ్రై చేసిన ఫుడ్‌ను తినొద్దు.. బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహారాన్ని అస్సలు తినొద్దు. రోజూ తినే ఆహారంలో ఫ్రై చేసిన ఫుడ్ లేకుండా చూసుకోండి. వీటి వలన శరీరంలో అధిక కొవ్వు పెరిగే ప్రమాదం ఉంది. దానికి బదులుగా.. సలాడ్ తినండి. చాలా మంచిది. సలాడ్ తినడం ద్వారా త్వరగా కడుపు నిండినట్లు అనిపించడంతో.. జంక్ ఫుడ్‌కు దూరమవుతారు.

బ్యాగ్‌లో పండ్లు ఉంచుకోండి.. మీరు బయటకు వెళ్తున్నట్లయితే.. మీ వెంట బ్యాగ్‌లో కొన్ని ఫలహారాలు ఉంచుకోండి. ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే.. జంక్ ఫుడ్‌కి బదులుగా ఆ ఫలాలను తినండి. అలాగే.. ఇంట్లో తయారు చేసిన హెల్తీ ఫుడ్‌ను తినండి. చాలా ఉపయోగకరం.

Also read:

Coal Shortage: పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి.. సరఫరా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి

Rains: పొంగి పొర్లుతోన్న వెదురుగెడ్డ వాగు.. తూర్పు – విశాఖ జిల్లా సరిహద్దుల్లో రాకపోకలు బంద్

Milk Adulteration: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా?.. ఈ సింపుల్ టిప్స్‌తో పాల కల్తీని తేల్చేయండి..