AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Growing: జుట్టు సమస్యలతో సతమతవుతున్నారా?.. అయితే, ఈ 7 ఆహార పదర్థాలను తప్పక తినాల్సిందే..

Hair Care: పొడవైన, అందమైన జుట్టు ఆ కళనే వేరు. అందుకే అందరూ జుట్టు పెద్దగా పెంచుకోవడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టే కీలకం. కానీ, చాలామంది జుట్టు సంబంధిత

Hair Growing: జుట్టు సమస్యలతో సతమతవుతున్నారా?.. అయితే, ఈ 7 ఆహార పదర్థాలను తప్పక తినాల్సిందే..
Hairfall
Shiva Prajapati
|

Updated on: Oct 10, 2021 | 10:01 PM

Share

Hair Care: పొడవైన, అందమైన జుట్టు ఆ కళనే వేరు. అందుకే అందరూ జుట్టు పెద్దగా పెంచుకోవడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టే కీలకం. కానీ, చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో సతమతం అవుతుంటారు. చండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టు బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యం ఒక కారణం అయితే.. పౌష్టికాహార లోపం మరో కీలక కారణం. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. మీరు తినే ఫుడ్‌లో పౌష్టికాహారం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం, జుట్టు పాలిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు బలంగా, రాలిపోకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు కీలకం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. పాలకూర… పాలకూరలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మీ రెగ్యులర్ డైట్‌లో పాలకూర తింటే.. మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో విటమిన్ సి, ఫోలేట్, ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2. సాల్మన్.. సాల్మన్‌ చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. సాల్మన్ చేప జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషకాలు అందిస్తుంది. క్రమం తప్పకుండా సాల్మన్ తింటే జుట్టు రాలడం తగ్గుతుంది.

3. గ్రీక్ పెరుగు.. గ్రీక్ పెరుగు కూడా జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. గ్రీక్ పెరుగులో విటమిన్ బి 5 ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

4. జామ.. జామలో అధికస్థాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది. జామను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్‌గా చేసి హెయిర్ మాస్క్‌గా అప్లై చేస్తే జుట్టుకు చాలా మంచిది.

5. చిలగడదుంప.. చిలగడదుంపలలో బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మూలకం ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఆరోగ్యంగా ఉంచటంతో పాటు.. జుట్టుకు కూడా మేలు చేస్తుంది.

6. పొద్దుతిరుగుడు విత్తనాలు.. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని ప్రవాహా సక్రమంగా జరిగేలా చూస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు.. జుట్టు పొడవుగా, సిల్కీగా ఉండటానికి సహాయపడుతాయి.

7. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇనుము మొత్తాన్ని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Also read:

E-commerce: నాలుగు రోజులు.. 2.7 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ అమ్మకాలు..

Space News: ఆ బ్లాక్‌ నైట్‌ శాటిలైట్‌ ఏలియన్స్‌దేనా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నాసా!

Vishnu Vs Prakash Raj: మా అధ్యక్ష పీఠంపై మంచు విష్ణు.. ఓడిన ప్రకాష్ రాజ్.. బలాలు , బలహీనతలు ఏమిటంటే..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..