Space News: ఆ బ్లాక్ నైట్ శాటిలైట్ ఏలియన్స్‌దేనా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నాసా!
Space News: ఏలియన్స్.. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. అవును.. చాలా కాలం నుంచి ఏలియన్స్ ఉన్నాయా..? ఉత్పన్నమవుతూనే ఉంది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.
Space News: ఏలియన్స్.. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. అవును.. చాలా కాలం నుంచి ఏలియన్స్ ఉన్నాయా..? ఉత్పన్నమవుతూనే ఉంది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. కానీ ప్రపంచదేశాలు గ్రహంతర వాసుల జాడను కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల థీయరీలు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా ఏలియన్స్ బ్లాక్ నైట్ శాటిలైట్ పేరుతో ఓ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల దెబ్బకు ఏకంగా నాసానే ఎంటర్ అయి మరీ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ.. ఆ బ్లాక్ నైట్ శాటిలైట్ ఏంటి.? నాసా చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటి.?
సెప్టెంబర్ 2న ఆకాశంలో ఓ నల్లని ఆకారంలో ఉన్న వస్తువు కనిపించింది. ఇక అప్పటి నుంచి పలు సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్స్‌లో.. ఏలియన్స్ UFO చక్కర్లు కొట్టిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సీన్‌ను మొబైల్ ఫోన్‌లో క్యాప్చర్ చేసి మరీ వివిధ పేర్లతో రచ్చరచ్చ చేస్తున్నారు. అంతేకాదు దీనికి.. అన్‌ఐడెంటిఫైడ్ మిస్టీరియస్ శాటిలైట్ అనే పేరుతో ప్రచారం జరుగుతుంది. ఇక మరికొందరు నెటిజన్స్ మాత్రం.. ఇది కచ్చితంగా బ్లాక్ నైట్ శాటిలైట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ వార్తలపై నాసా స్పందించింది. అసదలు శాటిలైట్ కాదని తేల్చేసింది. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలమని తెలిపింది. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెప్పింది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయని తెలిపింది. ఒకవేళ.. నిజంగానే వేరే గ్రహాలను నుంచి UFOలు.. భూకక్ష్యలోకి వచ్చి ఉంటే.. తమ నాసా రాడార్లకు సిగ్నల్స్ వచ్చేయని వెల్లడించింది నాసా.
Also read: