Mental health: డిప్రెషన్ కి గుండె జబ్బులకు లింకు! ఎక్కువగా ఆలోచించారో ఇక అంతే సంగతులు..
అయితే మనసు కూల్ గా లేకపోతే.. అది డిప్రెషన్ దారి తీసి చివరికి గుండె జబ్బులతో ప్రాణాన్ని హరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువపరుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు డిప్రెషన్ కి, గుండె జబ్బులకు లింకేంటి? దీనిని ఎలా దూరం చేసుకోవచ్చు..
మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. కేవలం శరీరం ఫిట్ గా ఉండటం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా కూడా అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. అయితే మనసు కూల్ గా లేకపోతే.. అది డిప్రెషన్ దారి తీసి చివరికి గుండె జబ్బులతో ప్రాణాన్ని హరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువపరుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు డిప్రెషన్ కి, గుండె జబ్బులకు లింకేంటి? దీనిని ఎలా దూరం చేసుకోవచ్చు అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం..
అధ్యయనం తేల్చింది ఇదీ..
ఇటీవలి అధ్యయనం ప్రకారం, 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల 500,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి డేటాను పరిశీలించిన పరిశోధకులు, విచారం లేదా నిరాశను అనుభవించే వారు హృదయ సంబంధ వ్యాధులు (CVD) అభివృద్ధి చెందే అవకాశం ఉందని, వీరిలో గుండె ఆరోగ్యం సరిగా లేదని కనుగొన్నారు. కౌమారా దశలో ప్రారంభం అయిన ఈ పరిస్థితి మధ్య వయసు వరకూ కొనసాగుతుందని తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించారు. తమ సహచరులతో పోలిస్తే, నిరాశకు గురై, మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా ఉన్నామని స్వయంగా నివేదించిన యువకులకు గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నట్లు వారు నిర్ధారించారు. కేవలం డిప్రెషన్ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నట్లు తేల్చారు.
ఒత్తిడికి గురై నప్పుడు ఏం జరుగుతుంది..
సాధారణంగా మీరు ఒత్తిడికి గురైనప్పుడు, ఆత్రుత లేదా నిరుత్సాహానికి గురైనప్పుడు, మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతాయి. అలాగే ఇది ధూమపానం, మద్యం సేవించడం, తక్కువ నిద్రపోవడం వంటి వాటి వల్ల కూడా ఇది జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలా చేయాలి..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పనులు చేయడం, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి చేయడం, కృతజ్ఞతాభావంతో ఉండడం, సూర్యరశ్మిలో కొంత సేపు సమయాన్ని గడపడం మరియు ప్రకృతిలో కాసేపు ఉండడం వంటివి చేయడం వల్ల మీ మనసు హాయిగా ఉంటుంది, మూడ్ ఎలివేట్ అవ్వడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన వంటివి దూరమవుతాయి. దాంతో మానసిక ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..