Kanha Music fest: మ్యూజిక్ ఫెస్టివల్‌లో నేడు చౌరాసియా వేణుగానం.. కుస్తీ శిక్షణ విడిచి పిల్లనగ్రోవి పట్టిన హరిప్రసాద్ సంగీత ప్రస్థానం

ఓసారి కుస్తీ శిక్షణ నుంచి ఇంటికి వస్తుంటే పంట కాలువ గట్టున ఓ పిల్లవాడు పిల్లనగ్రోవిని ఉంచి నీళ్లుతాగుతున్నాడు. ఆ వేణువును చూసి మనసుపారేసుకున్నారు చౌరాసియా. అప్పుడాయనకు పదేళ్లు ఉంటాయేమో!

Kanha Music fest: మ్యూజిక్ ఫెస్టివల్‌లో  నేడు చౌరాసియా వేణుగానం.. కుస్తీ శిక్షణ విడిచి పిల్లనగ్రోవి పట్టిన హరిప్రసాద్ సంగీత ప్రస్థానం
Hariprasad Chaurasia
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Feb 02, 2023 | 7:36 AM

ఆదిగురువు లాలాజీ మహారాజ్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్ ఫెస్టివల్  అండ్ మెడిటేషన్ సెక్షన్స్  కార్యక్రమాలనునిర్వహిస్తున్నారు.  ఈ ఉత్సవాల్లో సుమారు 65 దేశాల నుంచి దాజీ ఫాలోవర్స్, ధ్యానం అభ్యాసకులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా మ్యూజికల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. నేడు  సుప్రసిద్ధ సంగీతకళాకారులు హరిప్రసాద్‌ చౌరాసియా తన వేణుగానంతో సంగీత ప్రియులను అలరించనున్నారు.

కోయిలమ్మ కూజితము మధురంగా ఉంటుందా ? హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం తీయంగా ఉంటుందా? అంటే ఏం చెబుతాం? ఏ మాత్రం సందేహపడకుండా హరిప్రసాద్‌ మురళి రవళికే పట్టం కడతాం! ఎందుకంటే ఆయన పిల్లనగ్రోవి అంత అద్భుతంగా ఉంటుంది మరి! నిజంగానే ఆయన శ్వాసలో చేరిన గాలి వేణువు ద్వారా గాంధర్వమవుతుంది.. ఆయన మోవిపై వాలిన మురళి ధన్యమవుతుంది.

హరిప్రసాద్‌ చౌరాసియా ఇప్పుడు వేణువుకు పర్యాయపదం. హరిప్రసాద్‌ చౌరాసియాకు సంగీతమంటే ఎనలేని మక్కువ. తండ్రికి మాత్రం తనలాగే గొప్ప మల్లయోధుడు కావాలన్న కోరిక..కుస్తీ నేర్చుకోవడం పిల్లోడికి ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక కుస్తీలు పట్టడం నేర్చుకోసాగాడు.. ఓసారి కుస్తీ శిక్షణ నుంచి ఇంటికి వస్తుంటే పంట కాలువ గట్టున ఓ పిల్లవాడు పిల్లనగ్రోవిని ఉంచి నీళ్లుతాగుతున్నాడు. ఆ వేణువును చూసి మనసుపారేసుకున్నారు చౌరాసియా. అప్పుడాయనకు పదేళ్లు ఉంటాయేమో! దాన్ని తీసుకుని పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చి పడ్డారు. అది మొదలు వేణువు హరిప్రసాద్‌ జీవితంలో ఓ భాగమయ్యింది. ఏ శుభముహూర్తాన వేణువును దొంగిలించారో కానీ అదే ఆయనను విశ్వవిఖ్యాతిని చేసింది.. వేణువాదనలో విశారదుడిని చేసింది. పద్మవిభూషణుడిని చేసింది..

ఇవి కూడా చదవండి

1938లో అలహాబాద్‌ నగరంలో జన్మించారు హరిప్రసాద్‌. నాలుగేళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. తమ్ముడు కూడా చిన్నప్పుడే కన్నమూశాడు.. ఆ చిన్నిగుండె తల్లడిల్లింది.. మనసులో గూడుకట్టుకున్న వెలితిని దూరం చేసుకోవడానికి సంగీతాన్ని ఆశ్రయించారు. ఎక్కడ సంగీత కచేరీలు జరిగినా అక్కడికి వెళ్లిపోయేవారు. కుస్తీ పట్లు పడుతూనే రహస్యంగా సంగీతం కూడా నేర్చుకున్నారు. ఇంట్లో ప్రాక్టీస్‌ చేస్తే తండ్రికి తెలుస్తుందన్న భయంతో స్నేహితుడికి ఇంటికి వెళ్లి సాధన చేసేవాడు. 15 ఏళ్ల వయసులో పొరుగునే ఉన్న పండిట్‌ రాజారామ్‌ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టారు. ఆయన కూడా హరిప్రసాద్‌ అనురక్తిని గమనించి ఏమీ తీసుకోకుండా సంగీతంలో కిటుకులను నేర్పారు. ఏకసంథాగ్రాహి అయిన హరిప్రసాద్‌ తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకున్నారు. తర్వాత వారణాసికి చెందిన బోలానాథ్‌ దగ్గర ఫ్లూట్‌ వాయించడం నేర్చుకున్నారు. 19 సంవ త్సరాల వయసులో కటక్‌, ఒరిస్సా రేడియోలో శాస్త్రీయ సంగీత కళాకారునిగా ఉద్యోగంలో చేరారు. అప్పుడే బాబా అల్లావుద్దీన్ ఖాన్ కూతురు అన్నపూర్ణాదేవి దగ్గర సంగీతంలో పాఠాలు నేర్చుకున్నారు. మురళిని ఆరో ప్రాణంగా భావించే హరిప్రసాద్‌ వేణుగానంలో సరికొత్త పద్దతులను ఆవిష్కరించారు.

కటక్‌ రేడియోలో కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత హరిప్రసాద్‌కు బొంబాయి రేడియో కేంద్రానికి బదిలీ అయింది. అప్పడే హరిప్రసాద్‌ జీవితం కొత్త మలుపులు తిరిగింది. ఆయన ముంబాయిలో రేడియోలో ఉన్నప్పుడు ఆ కేంద్రానికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. అందుకు కారణం హరిప్రసాద్‌ వేణుగానమే! ఆ సమయంలోనే బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకులతో హరిప్రసాద్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని సినిమా పాటలకు తన వేణుగాన సహకారాన్ని అందించే అవకాశం వచ్చింది. సంతూర్‌ వాద్యకారుడు పండిట్‌ శివకుమార్‌ శర్మ (ఇటీవలే స్వర్గస్తులయ్యారు)తో కలిసి అసంఖ్యాక కచేరీలు చేశారు. వీరి జుగల్‌బందీ శివ్‌-హరిగా ప్రసిద్ధిపొందింది. చౌరాసియా వేణుగానం ఖండాంతరాలు దాటింది. హరిప్రసాద్ ఆల్బమ్స్‌ విపరీతంగా అమ్మడయ్యాయి. కృష్ణధ్వని, కాల్ ఆఫ్ ద వ్యాలీ, మేఘ్ మల్హర్, ఇమ్మోర్టల్ సిరీస్, నైట్ రాగాస్, మార్నింగ్ టు మిడ్‌ రాగాస్ ఇలా ఎన్నో ఎన్నెన్నో.. బీటిల్స్‌ వంటి ఇంటర్నేషనల్ మ్యూజికల్ బ్యాండ్స్తో కూడా హరిప్రసాద్‌ చౌరాసియా కొలాబరేట్ అయ్యారంటే ఆయన ప్రతిభావ్యుత్పత్తులు ఎంతటివో అర్థంమవుతోంది. కెన్ లాబర్ లాంటి చాలామంది ప్రముఖ సంగీత విద్యాంసులతో కలిసి ఆయన సంగీత కచేరిలు ఇచ్చారు. పండిట్‌ శివకుమార్‌ శర్మతో కలిసి సినిమాలకు సంగీతం అందించారు చౌరాసియా. సిల్‌సిలా ఈ సంగీత ద్వయం మొదటి సినిమా. డర్‌, లమ్హే, చాందిని, ఫాస్లే, విజయ్‌, పరంపర, సాహిబా వంటి సినిమాల్లో వీరు అందించిన సంగీతం అమితంగా ఆకట్టుకుంది.

సిక్స్టీన్ డేస్ ఇన్ అఫ్గానిస్థాన్‌ అనే ఆంగ్ల చిత్రంలో కొన్ని చోట్ల హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం వినిపిస్తుంది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే హరిప్రసాద్‌ చౌరాసియా పలు తెలుగు సినిమా పాటలకు వేణుగానాన్ని అందించారన్నది! బాలమిత్రుల కథ సినిమాలో గున్నమామిడి కొమ్మ మీద అన్న పాట వినే ఉంటారు.. ఆ పాటకు వేణుగాన సహకారం అందించింది హరిప్రసాదే! ఇక సిరివెన్నెల సినిమాలో ఆయన అందించిన అద్భుతమైన వేణుగానాన్ని ఎవరైనా మర్చిపోతారా?

చిన్నారులలో సంగీత పరిజ్ఞానాన్ని పెంచే భావనతో ఆయన బృందావన్‌ గురుకుల్‌ను ఏర్పాటు చేశారు. పేద పిల్లలు ఇక్కడ ఉచితంగా సంగీతం నేర్చుకోవచ్చు. జన్మాష్టమి రోజున తన శిష్యగణంతో 24 గంటల పాటు వేణుగానంతో అలరిస్తుంటారు చౌరాసియా.

చౌరాసియా మొదట కమలాదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఆ తర్వాత గాయని అనూరాధ రాయ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. 2013లో హరిప్రసాద్‌పై బాన్సురీ గురు పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దాన్నినిర్మించింది కుమారుడు రాజీవ్‌ చౌరాసియానే! ఇక ఆయనపై ఇప్పటి వరకు అనేక పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో హరిప్రసాద్‌ చౌరాసియా: రోమాన్స్‌ ఆఫ్‌ ది బాంబూ రీడ్‌, వుడ్‌విండ్స్‌ ఆఫ్‌ చేంజ్‌, హరిప్రసాద్‌ చౌరాసియా అండ్‌ ద ఆర్ట్‌ ఆప్‌ ఇంప్రవైజేషన్‌, బాన్సురీ సామ్రాట్‌ ముఖ్యమైనవి. ఇక ఆయన జీవితగాధపై బ్రెత్‌ ఆఫ్‌ గోల్డ్‌ పేరుతో బయోగ్రఫీ వచ్చింది. దీన్ని సత్యశరణ్‌ రాశారు.

హరిప్రసాద్‌ వేణుగానానికి తన్మయత్వం చెంది అనేక అవార్డులు, రివార్డులు దాసోహం అన్నాయి. 1984లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న హరిప్రసాద్‌ 1992లో కోణార్క్‌ సమ్మాన్‌ పురస్కారాన్ని పొందారు. కేంద్ర ప్రభుత్వం హరిప్రసాద్‌ను గౌరవిస్తూ 1992లో పద్మభూషణ్‌, 2000లో పద్మవిభూషణ్‌ పురస్కారా లతో సత్కరించింది. విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమీ నాద విద్యాభారతి బిరుదుతో సత్కరించింది. నార్త్‌ ఒరిస్సా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. ఆయన వేణుగానం వింటున్న మనం ధన్యులం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇది దక్కదు..

—-బాలసుబ్రమణ్యం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!