బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు నెట్‌వర్త్ ఎంతంటే.. క్రికెటర్లకు ఏమాత్రం తగ్గేదేలే..
TV9 Telugu
23 December 2024
PV Sindhu Networth: 29 ఏళ్ల సింధు డిసెంబర్ 22న పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.
రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు సాయి-సింధు ఏడడుగులు నడిచారు. కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.
ఈ క్రమంలో పీవీ సింధు నెట్ వర్త్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కేవలం ఆటతోనే కాదు, బ్రాండ్లతోనూ సింధు కోట్లు సంపాదించింది.
దీంతో పీవీ సింధు క్రికెటర్లతో సమానంగా సంపాదన చేసేది. ప్రకటల్లోనూ వారిలో పోటీపడేది. ప్రస్తుతం ఆమె నికర విలువ దాదాపుగా రూ. 60 కోట్లుగా ఉందని తెలుస్తోంది.
ఇందులో ప్రైజ్ మనీ రూపంలో వచ్చిన డబ్బుతోపాటు ప్రకటనలతో వచ్చిన డబ్బు కూడా ఉంది. ప్రైజ్ మనీ కంటే ప్రకటనలతోనే ఎక్కువగా వెనకేసింది.
సింధు దగ్గర లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్ 5, మహింద్రా థార్, బీఎండబ్ల్యూ 320డి, డాట్సన్ రెడి గో కార్లు ఉన్నాయి.
గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ క్వీన్ పెద్దగా రాణించడం లేదనే సంగతి తెలిసిందే. 2023లో పేలవ ప్రదర్శనతో విఫలమవ్వగా, 2024లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు.
పెళ్లి తర్వాత ఆటలో కొనసాగుతారా లేదా అన్నది చూడాలి. అయితే, త్వరలో రిటైర్మెంట్ చేయనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.