Tollywood: సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘనటపై ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశమయ్యింది. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. అలాగే బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అలాగే శ్రీతేజ్ ను పరామర్శించారు నటుడు ఆర్ నారాయణ మూర్తి.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. మరోవైపు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నబాలుడు శ్రీతేజ్ తండ్రిని పరామర్శించి ధైర్యం చెప్పారు నటుడు ఆర్ . నారాయణమూర్తి. తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్‌రెడ్డి..సీఎం నిర్ణయాల వల్ల సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుందంటున్నారు.
“పిక్చర్ టు పిక్చర్ టిక్కెట్ రేట్లు చేంజ్ చేయడం వల్ల ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారు. టిక్కెట్ రేట్లు ఫిక్స్ గా ఉండాలి. తొలి మూడు, నాలుగు రోజులు పేద విద్యార్థులు, ఫ్యాన్స్, లేబర్ ఎక్కువగా చూస్తారు. వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయడం ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని ఆల్రెడీ దిల్‌రాజు దృష్టికి తీసుకెళ్లాం. లక్కీగా ఈ విషయం గురించి సీఎం స్పందించారు. సీఎంగారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులు టిక్కెట్ రేట్లలో కన్‌ఫ్యూజ్ కాకూడదు. కొన్ని సందర్భాల్లో జీవో ఒక్క షోకి వచ్చినా.. ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్ వస్తోంది. ఆ జీవోలు ప్రేక్షకులకు చేరువకావడం లేదు.. అలాంటప్పుడు కలెక్షన్లకు ఇబ్బంది కలుగుతోంది. తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన మీటింగ్‌లో ఆంధ్రకి చెందిన ఎగ్జిబిటర్లు, కొందరు ప్రొడ్యూసర్లు మా నిర్ణయాన్ని ఆహ్వానించారు. టిక్కెట్ రేట్లు పెంచడం వల్లనే సింగిల్ స్క్రీన్స్ మనుగడ ఇబ్బందుల్లో పడింది. సీఎం రేవంత్‌గారి నిర్ణయం వల్ల ఇంకో నాలుగైదేళ్లు సింగిల్ థియేటర్ల మనుగడ బావుంటుంది. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలి” అని విజేందర్ రెడ్డి.
కాగా.. డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లాడు. ఈ క్రమంలోనే హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాలను తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహేళ మరణించగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.