AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies: ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.. ఎప్పుడు రిలీజ్ కానున్నాయంటే..

కొత్త సంవత్సరం స్టార్ట్ కావడానికి ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యేందుకు కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషలలో పలు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. అవెంటో తెలుసుకుందామా..

Upcoming Movies: ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.. ఎప్పుడు రిలీజ్ కానున్నాయంటే..
Baby John
Rajitha Chanti
|

Updated on: Dec 23, 2024 | 1:09 PM

Share

2024 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం స్టార్ట్ రానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే భారీ బడ్జెట్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఏడాది చివరలో మరికొన్ని సినిమాలు విడుదలకానున్నాయి. ఇంతకీ ఈ ఏడాది చివరి వారంతంలో థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో తెలుసుకుందామా.

Barroz 3D Movie: మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ బరోజ్ త్రీడీ. ఈనెల 25న ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ నవలని ఆధారం చేసుకుని ఈ ఫాంటసీ కథను సిద్ధ చేశారు.

Srikakulam Sherlock Holmes: కమెడియన్ వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రైటర్ మోహన్ తెరకెక్కించిన ఈ సినిమాను వెన్నెపూస రమణారెడ్డి నిర్మించారు. ఇందులో అనన్య నాగళ్ల, స్నేహగుప్తా, కీలకపాత్రలు పోషించరారు. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది.

Max The Movie: కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటించిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిల్మ్ మ్యాక్స్. వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 27న విడుదలకానుంది.

Baby John Movie: సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ మొదటిసారి హిందీలో నటిస్తున్న సినిమా బేబీ జాన్. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

నెట్ ఫ్లిక్స్..

స్క్విడ్ గేమ్ 2… డిసెంబర్ 26 ది ఫోర్జ్.. డిసెంబర్ 22 ఓరిజిన్.. డిసెంబర్ 25.. భూల్ భూలయ్య 3.. డిసెంబర్ 27 సార్గవాసల్.. డిసెంబర్ 27

అమెజాన్ ప్రైమ్..

సింగం అగైన్.. డిసెంబర్ 27 థానర.. డిసెంబర్ 27

జియో సినిమా..

డాక్టర్స్.. డిసెంబర్ 27

హాట్ స్టార్

వాట్ ఇప్..? 3.. డిసెంబర్ 22 డాక్టర్ వూ.. డిసెంబర్ 26

జీ5.. ఖోజ్.. డిసెంబర్ 27

మనోరమా మ్యాక్స్.. పంచాయత్ జెట్టీ..

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.