- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu, Rajamouli movie ssmb29 shooting may start in 2025 January, 1st part release in 2026, 2nd part release in 2027
SSMB 29: ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి అన్ని ఇయర్స్ ఆ.!
మరో రెండు మూడేళ్ళ పాటు.. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందా అంటే అది SSMB 29 మాత్రమే. జక్కన్నేమో ఏమీ చెప్పరు.. మహేష్‌ను ఏమో ఏమీ చెప్పొద్దని చెప్తారు. రూమర్స్ మాత్రం అస్సలు ఆగవు.. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. మరి తాజాగా వచ్చిన న్యూస్ ఏంటి..? మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేవరకు రూమర్స్ అయితే వస్తూనే ఉంటాయి.
Updated on: Dec 23, 2024 | 1:01 PM

మరో రెండు మూడేళ్ళ పాటు.. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందా అంటే అది SSMB 29 మాత్రమే.

జక్కన్నేమో ఏమీ చెప్పరు.. మహేష్‌ను ఏమో ఏమీ చెప్పొద్దని చెప్తారు. రూమర్స్ మాత్రం అస్సలు ఆగవు.. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. మరి తాజాగా వచ్చిన న్యూస్ ఏంటి..?

మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేవరకు రూమర్స్ అయితే వస్తూనే ఉంటాయి. అందులో తగ్గేదే లే అంటున్నారు గాసిప్ రాయుళ్లు.

ప్రతీ రెండ్రోజులకోసారి మేమున్నాం అంటూ SSMB29ను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి వైరల్ అవుతుంది SSMB29. జనవరిలో ఈ సినిమాపై మేజర్ అప్‌డేట్ రాబోతుంది.

మహేష్, రాజమౌళి సినిమాపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంపై వచ్చిన గాసిప్.. రెండు భాగాలు కాదు ఒకే భాగంగా SSMB29 రాబోతుందని.!

ఈ చిత్రాన్ని 2 పార్ట్స్‌గా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని.. ఒకటి 2026, మరోటి 2027లో విడుదల కానున్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ అదేం కాదు.. సింగిల్ పార్ట్ సినిమానే అంటూ తాజా ఖబర్.

SSMB29 క్యాస్టింగ్‌పైనా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా పేరు రెండు మూడు రోజులుగా వినిపిస్తూనే ఉంది.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తోడైంది. 2025లో షూట్ మొదలు పెట్టి.. 2027లో సినిమా విడుదల చేయాలనేది జక్కన్న ప్లానింగ్. ఇది నిజమే అయితే.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.





























