AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. ఇంటికెళ్తూ లాయర్‌ బైక్‌నే ఎత్తుకెళ్లాడు! కట్‌చేస్తే..

బైక్ దొంగతనాల్లో ఆరితేరిన ఓ దొంగ తన చోరీ కేసుల కోసం లాయర్ ను పెట్టుకున్నాడు. అతడికి ఫీజు చెల్లించి ఇంటికి వెళ్తూ.. ఏకంగా లాయర్ బైక్ నే ఎత్తుకెళ్లాడు. తీరా తన బైక్ పోయిందని గ్రహించిన లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు సంగతి బయటపడింది. దీంతో అన్నం పెట్టిన వాడికే సున్నం రాయడంతో మండిన లాయర్ చివరకు

చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. ఇంటికెళ్తూ లాయర్‌ బైక్‌నే ఎత్తుకెళ్లాడు! కట్‌చేస్తే..
Thief Steals Lawyer's Two Wheeler
Srilakshmi C
|

Updated on: Dec 23, 2024 | 2:05 PM

Share

నెల్లూరు, డిసెంబర్‌ 23: ఓ కేటుగాడు అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టాడని చూశాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్నాడు ఓ కేటుగాడు. ఇలా బైక్‌ల దొంగతనంలో రాటు తేలిపోయాడు. కొట్టేసిన బైకులను ఏంచక్కా అమ్మేసి జల్సాలు చేసుకునే వాడు. మనోడి ట్యాలెంట్ ఏ రేంజ్‌లో ఉండేదంటే.. చివరాకరికి సీసీటీవీలకు కూడా దొరకలేదు. కన్ను పడిందంటే చాలు.. తాళాలు వేసినా.. వేయకపోయినా చిటికెలో బైక్‌లను మాయం చేసేస్తాడు. అయితే ఈ మహామాయగాడి యవ్వారం ఓ చిన్న తప్పుతో బట్టబయలైంది. తన చోరీ కేసులు చూసుకుని అరెస్టైనప్పుడల్లా జైలు నుంచి బయటకు తీసుకొస్తాడు కదాని ఓ లాయర్ని పురమాయించుకున్నాడు. కానీ చివరకు అదే లాయర్‌ అతగాడిని కటకటాల వెనకవేశాడు. ఈ వింత చోరీ శిఖామణి కేసు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

నెల్లూరుకు చెందిన నిందితుడు.. తన చోరీ కేసులు వాదించేందుకు కావలిలో ఓ లాయర్‌ని సంప్రదించాడు. మొత్తం అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పి, కేసు వాయిదాలకు తిరగసాగాడు. ఇటీవల ఓ కేసు వాయిదా విషయమై వచ్చిన నిందితుడు లాయరుతో మాట్లాడి.. ఆయనకు ఫీజు కూడా చెల్లించాడు. తిరిగి ఇంటికెళ్తూ.. జేబులు చూసుకుంటే నిల్‌. దీంతో చోరీ కేసులు వాదించేందుకు పురమాయించిన లాయిర్‌కే ఎసరు పెట్టాడు. తన లాయర్ బైక్‌నే సైలెంట్‌గా కొట్టేసి.. అక్కడి నుంచి చక్కాపోయాడు.

ఆనక తన బైక్‌ మిస్సైన విషయం తెలుసుకున్న లాయర్‌.. కావలి టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. లాయర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. బైక్ చోరీ చేసిన దొంగను అరెస్ట్ చేశారు. తన బైక్‌ను చోరీ చేసింది తన క్లైంటేనన్న సంగతి తెలుసుకున్న లాయర్‌ షాక్‌కు గురయ్యారు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని కావలి టూటౌన్ సీఐ గిరిబాబు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.