Hyderabad: సరదా పడి కొండరాయి పైకెక్కాడు.. రెండు రాళ్ల మధ్య ఇరుక్కుని గిలగిలలాడాడు
తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి ముచ్చట పడ్డాడు. ఓసారి దానిపైకి ఎక్కాలనిపించి రాయిపైకి ఎక్కాడు. ఈక్రమంలో పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు.
సరదా పడి ఓ పెద్ద బండరాయిపైకెక్కిన యువకుడు ఊహించని చిక్కుల్లో పడ్డాడు. బండరాయి బావుందికదా అని పైకెక్కి పట్టుతప్పి జారిపడ్డాడు.. రెండు రాళ్లమధ్య ఇరుక్కుపోయాడు. దాదాపు కొన్ని గంటల పాటు ఆ బండరాళ్ల మధ్య గిలగిలలాడాడు. తనను ఎవరైనా రక్షిస్తారా అని ఆర్తిగా ఎదురుచూశాడు.. చివరికి పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని బండరాళ్ల మధ్యనుంచి బయటకు తీశారు. దాదాపు 3 గంటల పాటు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ యువకుడిని తిరుమలగిరి పోలీసులు రక్షించారు. భాగ్యనగరంలో తిరుమలగిరి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రకు చెందిన రాజు అనే యువకుడు బతుకు దెరువుకోసం హైదరాబాద్‌కి వచ్చాడు. జనవరి 30న సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి ముచ్చట పడ్డాడు. ఓసారి దానిపైకి ఎక్కాలనిపించి రాయిపైకి ఎక్కాడు. ఈక్రమంలో పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. రాళ్లమధ్యలో ఇరుక్కున్న యువకుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుళ్లు రాంబాబు, బాషా, రాజు.. అక్కడికి చేరుకొని అతడి భూజానికి తాళ్లు కట్టి బయటకు లాగారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జనవరి 30 రాత్రి అతన్ని సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలారు. రాజును కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ శ్రావణ్‌కుమార్ అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..