Fatigue Reasons: తొందరగా అలసట చెందుతున్నారా..? దానికి కారణాలివే.. వెంటనే నివారించకపోతే పెను ప్రమాదమే..
తరచూ అలసిపోవడం. అలసటగా ఉండడం మన ఆరోగ్యానికి హానికరమని చెప్పుకోవాలి. అందుకే ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దని..
![Fatigue Reasons: తొందరగా అలసట చెందుతున్నారా..? దానికి కారణాలివే.. వెంటనే నివారించకపోతే పెను ప్రమాదమే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/fatigue-reasons-and-effects-on-health.jpg?w=1280)
Fatigue Reasons And Effects On Health
ప్రస్తుత కాలంలో చాలా మంది చూడడానికి ఎంతో నీరసంగా కనిపిస్తుంటారు. అందుకు వారు త్వరగా అలసిపోవడమే కారణం. ఇంకా చాలా మందిలో ఎనర్జీ లెవెల్స్ మరీ తక్కువగా ఉంటాయి. అది వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం ప్రభావమే. అయితే తరచూ అలసిపోవడం. అలసటగా ఉండడం మన ఆరోగ్యానికి హానికరమని చెప్పుకోవాలి. అందుకే ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం దీర్ఘకాలంపాటు అలసట మిమ్మల్ని వేధిస్తున్నా పరిష్కారం వెతకలేదంటే అనర్థాలకు దారితీయవచ్చు. అందుకే దానికి గల కారణాలను తెలుసుకొని నివారించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అసలు తరచూ అలసట చెందడానికి గల కారణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- కెఫిన్: కెఫీన్‌ను పరిమితంగా తీసుకుంటే చురుకుదనం పెరుగుతుంది. అదే ఎక్కువ తీసుకుంటే మాత్రం గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంకా ఇది బీపీ పెరిగేందుకు కూడా కారణం అవడంతో పాటు తరచూ అలసట చెందేలా చేస్తుంది. సాధారణంగా అలసట అనేది శారీరకంగాను, మానసికంగాను వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం అలసటకు దారి తీస్తుంటాయి.
- స్లీప్ అప్నియా: కొందరిలో తీవ్రమైన నిద్రలేమిని స్లీప్ అప్నియా అని పిలుస్తారు. దీనివల్ల సరిగ్గా నిద్రపట్టకపోగా శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా అలసటకు దారితీస్తుంది. తినాల్సిన ఆహార పదార్థాలు కాకుండా ప్యాకెజ్డ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినడంవల్ల కూడా క్రమంగా నిద్రలేమికి, తీవ్రమైన అలసటకు కారణం కావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలివల్ల దీనిని దూరం చేసుకోవచ్చు.
- నిద్రలేమి: సరైన నిద్రలేనివారిలోనూ అలసట సమస్య కనిపిస్తుంది. వీరిలో ఏకాగ్రత లోపిస్తుంది. క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అసటకు చక్కటి పరిష్కార మార్గం ఏమిటంటే ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవడం అంటున్నారు నిపుణులు. రాత్రిళ్లు ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలు చూస్తుండటం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది కాబట్టి రాత్రివేళ వాటిని దూరంగా పెట్టాలని చెప్తున్నారు.
- రక్తహీనత: మనలో రక్తహీనత కూడా అలసటకు కారణం అవుతుంది. మహిళల్లో రుతుస్రావ సమస్యలకు కూడా ఇదే కారణం. బాడీలో ఐరన్ లోపంవల్ల రక్తహీనత కలుగుతుంది. ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటివి తీసుకోవాలి. ఐరన్ వల్ల ఎర్రరక్తకణాల పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని అన్ని కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరాకు ఇదెంతో అవసరం. ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం, మాంసం, కాలేయం, చేపలు, బీన్స్, తృణధాన్యాలు తినడంవల్ల అలసట సమస్య దూరం అవుతుంది.
- డయాబెటిస్: డయాబెటిస్ ఉన్నవారిలో సాధారణంగా షుగర్ లెవల్స్ శరీర కణాలలోకి ప్రవేశించకుండా రక్తప్రవాహంలో ఉండిపోతాయి. ఇక్కడ శక్తిగా మారుతాయి. ఫలితంగా శరీరానికి సరిపడా తిన్నప్పటికీ ఆవిరైపోయినట్లు ఉంటుంది. నిరంతరం అలసట ఉంటే డయాబెటిస్ కు దారి తీయవచ్చు. ట్రీట్ మెంట్ తోపాటు తగిన పౌష్టకాహారం, వ్యాయామం, ఇన్సులిన్ థెరపీ, శరీరంలో షుగర్ లెవెల్స్‌ను ప్రాసెస్ చేయడంలో సహాయపడే మెడిసిన్, జీవన శైలి మార్పులవల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఇవి కూడా చదవండి
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/obesity.jpg)
Weight Lose Diet: అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే మీ సమస్యకు చెక్ పెట్టేయండిలా..
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/unwanted-facial-hair-removal-tips-for-women.jpg)
Unwanted Facial Hair: ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా..? అయితే వాటిని శాశ్వతంగా తొలగించేయండిలా..
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/reasons-behind-weight-increase-of-newly-married-woman.jpg)
Woman Health: పెళ్లైన స్త్రీలు బరువు పెరగడానికి గల కారణాలివే.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/ash-gourd-benefits.jpg)
Ash Gourd Benefits: ఇంటికి వేలాడే గుమ్మడికాయతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..