AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ash Gourd Benefits: ఇంటికి వేలాడే గుమ్మడికాయతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే..

జీర్ణ సంబంధిత వ్యాధులకు సైతం బూడిద గుమ్మడి మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.  బూడిద గుమ్మడికాయను. సలాడ్లు, జ్యూస్‌లు, కూరలు, సూప్‌లు, స్మూతీలు.. ఇలా..

Ash Gourd Benefits: ఇంటికి వేలాడే గుమ్మడికాయతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే..
Ash Gourd Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 31, 2023 | 7:45 AM

Share

కొత్తగా కట్టిన ఇంటికి గృహప్రవేశం సమయంలో దిష్టి తీయడానికి లేదా ఇంటి గుమ్మానికి వేలాడదీసి ఉండే బూడిద గుమ్మడికాయలు మనందరికీ తెలుసు. మరి వాటిని తింటారని. తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా..? చాలా రకాల వంటకాలలో ఉపయోగించే ఈ బూడిద గుమ్మడికాయలు మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తాయి. వీటికి ‘చైనీస్‌ వాటర్‌ మిలన్‌’, ‘వ్యాక్స్‌ గార్డ్‌’, ‘వింటర్‌ మిలన్‌’, ‘సఫేద్‌ కద్దూ’ అనే పేర్లతో కూడా పిలవబడే ఈ గుమ్మడికాయలను తరచుగా తినే వారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇలా అప్పుడప్పుడూ కాకుండా.. రోజూ బూడిద గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నీటి శాతం అధికంగా ఉండే ఈ బూడిద గుమ్మడికాయలను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చట.

అంతేకాక జీర్ణ సంబంధిత వ్యాధులకు సైతం బూడిద గుమ్మడి మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.  బూడిద గుమ్మడికాయను. సలాడ్లు, జ్యూస్‌లు, కూరలు, సూప్‌లు, స్మూతీలు.. ఇలా ఏ విధంగానైనా ఆహారంలో చేర్చుకోవచ్చు. మరి ఈ గుమ్మడికాయతో కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. గుమ్మడికాయలలో కూడా పుచ్చకాయ మాదిరిగానే నీటి శాతం అధికంగా ఉంటుంది. సుమారు 96 శాతం నీటితో నిండి ఉండే గుమ్మడికాయ డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతకంటే ముఖ్యంగా శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ను కూడా పెంచుతుంది.
  2. బూడిద గుమ్మడికాయలో పైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
  3. బూడిద గుమ్మడికాయలో క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి కేవలం 13 క్యాలరీలు మాత్రమే.
  4. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపించే డీటాక్సిఫై ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా దీనిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
  5. బూడిద గుమ్మడిలోని విటమిన్‌-సి, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌.. లాంటి విటమిన్లు.. ఐరన్‌, పొటాషియం, జింక్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.
  6. మెదడు పనితీరును మెరుగుపరచాలంటే దీనిని తరచుగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడి కాయ గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
  7. వీటి గింజల్లో కూడా బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వీటిని వివిధ రకాల మెడిసిన్, చర్మ సంరక్షణ నూనెల తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు