AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Almonds: పచ్చి బాదంపప్పుతో ఇన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారమా..? అవేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవడంతో పాటు ఆరగించాల్సిందే..

పచ్చి బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. రోజూ కొన్ని బాదంపప్పులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి బాదంపప్పులలో..

Green Almonds: పచ్చి బాదంపప్పుతో ఇన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారమా..? అవేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవడంతో పాటు ఆరగించాల్సిందే..
Green Almonds
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 29, 2023 | 2:00 PM

Share

Green Almonds: ‘కచా బాదం’ అనే పాట 2021-22 మధ్య కాలంలో సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేసిందో మనందరికీ తెలుసు. ఒరిజినల్ పాటను రకరకాలుగా రీక్రియేట్ చేసి వీడియో యాప్స్‌లో రకరకాల రీల్స్‌తో రచ్చ రచ్చ చేశారు నెటిజన్లు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ ఈ కచా బాదం పాటను అద్భుతమైన రీతిలో పాడారు. పాటను ఎంజాయ్ చేస్తున్నట్లుగానే.. బాదం పప్పును తినడాన్ని కూడా ప్రజలు ఆస్వాధిస్తుంటారు. ఇక ముఖ్యంగా నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల  ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొన్నిసార్లు రాత్రిపూట బాదంపప్పుని నానబెట్టడం మరిచిపోతుంటాం. అలాంటి సమయంలో పచ్చి బాదంపప్పుని తినడం కూడా మంచిదే. పచ్చి బాదంపప్పు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా వీటిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. రోజూ కొన్ని బాదంపప్పులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి బాదంపప్పులలో చాలా పోషకాలు ఉంటాయి. కశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రజలు పచ్చి బాదంపప్పును సలాడ్‌లు, పానీయాల రూపంలో అధికంగా వినియోగిస్తారు. కొంతమంది పచ్చి బాదంపప్పుల ఊరగాయ కూడా చేస్తారు. పచ్చి బాదంపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. రోగనిరోధక శక్తి: పచ్చి బాదంపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేస్తాయి.
  2. గుండె ఆరోగ్యం: ఆకుపచ్చ బాదం గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, రక్తకణాలు పెరుగుతాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పచ్చి బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  3. మెరుగైన జీవక్రియ: పచ్చి బాదంపప్పు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. వీటిని తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. పచ్చి బాదం పొట్టకు మేలు చేస్తుంది. ఇవి శరీరానికి ఎటువంటి వేడిని కలిగించవు.
  4. దృఢమైన ఎముకలు, దంతాలు: పచ్చి బాదంపప్పులో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ దంతాలు, ఎముకలని బలంగా చేస్తుంది. పచ్చి బాదంపప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చిగుళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. నోరు కూడా శుభ్రంగా ఉండే విధంగా చేస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. బ్లడ్ షుగర్ నియంత్రణ: పరగడుపున పచ్చి బాదంపప్పు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ముడి బాదం రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..