Pimple Marks Remedies: ఈ 6 ఇంటి చిట్కాలను పాటిస్తే.. మొటిమలు, మచ్చలు లేని ముఖారవిందం మీ సొంతం..

స్త్రీపురుష బేధం లేకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మాన్నిఅందరూ కోరుకుంటారు. టీనేజ్ ప్రారంభదశలో మొదలయ్యే ఈ మొటిమలు కొందరినీ జీవితాంతం వేధిస్తుంటాయి. వీటి పరిష్కారం కోసం ఎన్ని క్రీమలు వాడినా

Pimple Marks Remedies: ఈ 6 ఇంటి చిట్కాలను పాటిస్తే.. మొటిమలు, మచ్చలు లేని ముఖారవిందం మీ సొంతం..
Remedies For Pimple Marks
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 29, 2023 | 1:40 PM

స్త్రీపురుష బేధం లేకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మాన్నిఅందరూ కోరుకుంటారు. టీనేజ్ ప్రారంభదశలో మొదలయ్యే ఈ మొటిమలు కొందరినీ జీవితాంతం వేధిస్తుంటాయి. వీటి పరిష్కారం కోసం ఎన్ని క్రీమలు వాడినా ఫలితాలు లేక విసిగిపోతుంటారు మరి కొందరు. మొటిమల కారణంగా ఆత్మస్థైర్యం కోల్పోయి నలుగురిలోకి రావడానికి వెనుకాడతారు ఇంకొందరు. మరి ఈ మొటిమలకు పరిష్కారమే లేదా అంటే ఉంది. అయితే ముందుగా మొటిమల వల్ల ముఖం పాడవకుండా ఉండాలంటే.. ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పటికే మీకు మొటిమలు ఉన్నట్లయితే ఈ 6 చిట్కాలను ఉపయోగించడం ద్వారా చర్మ సంరక్షణతో పాటు మొటిమలు, మచ్చలు లేని చర్మాన్ని పొందవచ్చు. మరి ఆ చిట్కాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెతో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది మొటిమలతో సహా అన్ని రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్లు K, E అధికంగా ఉంటుంది. ఇవి మొటిమలను తొలగించడానికి ఉపయోగపడటమే కాకుండా.. ఆరోగ్యకరమైన చర్మ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. అందుకే.. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో ముఖం మీద మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలపై మర్ధన చేయాలి. రాత్రి అంతా అలాగే ఉంచి, ఉదయం మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ప్రతీ రోజూ ఇలా చేస్తే.. త్వరగా ఫలితం ఉంటుంది.
  2. శనగ పిండి: భారతీయ వంటశాలలలో కనిపించే అత్యంత సాధారణ పదార్ధాలలో శనగపిండి ఒకటి. ఇది అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారం. ఆల్కలైజింగ్ లక్షణాలు కలిగిన ఈ శనగపిండి.. మొటిమలను తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిని ఫేస్‌ స్క్రబ్‌లుగా కూడా ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ శనగపిండిలో సరిపడా రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. పేస్ట్‌లా కలిపిన తరువాత.. దానిని ముఖంపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  3. ఆరెంజ్ పీల్ పౌడర్: నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలు, మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి కారణమవుతుంది. 1 స్పూన్ నారింజ తొక్క పొడి, 1 స్పూన్ ముడి తేనె తీసుకుని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేయాలి. 10 – 15 నిమిషాల పాటు ఉంచుకుని.. ఆ తరువాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి.
  4. కలబంద: కలబంద.. మానవ జాతికి ప్రకృతి ఇచ్చిన వరం. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన కలబంద.. మొటిమల మచ్చలు, మచ్చలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. తాజా కలబంద ఆకుల నుండి వచ్చే జెల్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి. రాత్రి సమయంలో అప్లై చేసుకుని.. ఉదయం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్.. మొటిమలు, మొమల వల్ల ఏర్పడే మచ్చల తొలగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. అన్ని రకాల చర్మ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. మీరేం చేయాలంటే.. మూడు, నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్, కొబ్బరి/బాదాం నూనె మిక్స్ చేయాలి. ఆ తరువాత ఆ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ఇది అప్లై చేసిన తరువాత ఒక రెండు గంటల పాటు అలాగే ఉండనివ్వాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు ముఖానికి పెట్టుకుని.. ఉదయం మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ప్రతీ రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  7. నిమ్మకాయ మొటిమలను తొలగించడంలో నిమ్మకాయ కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేయాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..