Diabetes Symptoms: మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. తస్మాత్ జాగ్రత్త.. ఇవి ఆ వ్యాధికి సంకేతాలే కావచ్చు..!
ప్రస్తుత కాలంలో పాటిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. థైరాయిడ్, కొలెస్ట్రాల్‌తో పాటు మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు
ప్రస్తుత కాలంలో పాటిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. థైరాయిడ్, కొలెస్ట్రాల్‌తో పాటు మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు వారిని వేధిస్తున్నాయి. మధుమేహం వ్యాధి గురించి మాట్లాడితే.. దీని గురించి పూర్తి అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే.. శరీరంలో కలిగే పలు ప్రమాదకర వ్యాధులకు ఇదే కారణమని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనిని మొదట్లోనే గుర్తించకపోతే.. పరిస్థితి తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం రోగులకు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొంతమంది రోగులు పాదాలలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలలో ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మధుమేహం ఉంటే.. పాదాలలో కనిపించే లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- పాదాలపై దద్దుర్లు: శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉందంటే పాదాలకు దోమలు కుట్టడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీ పాదాలపై ఎక్కువ దురదగా అనిపిస్తే, అది మీ శరీరంలో మధుమేహానికి సంకేతం. ఇలాంటి లక్షణాన్ని గుర్తించిన వెంటనే చికిత్స చేయడం అవసరం. ఇది ప్రధాన లక్షణాలలో ఒకటి అనడంలో సందేహం లేదు.
- విపరీతమైన నొప్పి: మధుమేహ రోగుల్లోనే కాదు, మధుమేహం లేని వారు కూడా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పాదాలపై (Feet) చాలా శ్రద్ద పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే మధుమేహం ఉంటే పాదాల్లో విపరీమైన నొప్పి కలిగిస్తుంది. మీకు రెండు కాళ్ళలో నొప్పులు వస్తుంటే మీరు ప్రీడయాబెటిస్ ప్రారంభం అయిందనేది సంకేతం.
- కాలు తిమ్మిరి: కాళ్ళలో తీవ్రమైన తిమ్మెర్లు అనేక వ్యాధుల లక్షణాలలో ఒకటి. కాళ్లలో విపరీతమైన జలదరింపు ఉంటే, అది కూడా శరీరంలో మధుమేహానికి సంకేతం. తరచుగా, దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య ప రంగా శరీరానికి మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న మార్పులను కూడా గమనించాలి.
- కాళ్లకు చెమటలు పట్టకపోవడం: మీ పాదాలకు చెమట పట్టకపోతే, మీకు మధుమేహం ఉన్నట్లు సంకేతం. మీరు ఏదైనా పనిచేసేప్పుడు మీపాదాల్లో చెమటలు పట్టకపోతే కొంచెం గమనించాల్సిన విషయం. అలా పట్టకపోతే మీకు మధుమేహం ఉన్నట్లు సంకేతం. మరేదైనా సమస్యను సూచిస్తున్నట్లు సంకేతం.
- కాలు రంగు మారడం: పాదాలు ఎర్రగా కనిపించినా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా మధుమేహానికి సంకేతం. కాళ్ళు ఎర్రగా మారాయంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అది మిమ్మల్ని ప్రమాదానికి గురిచేస్తుంది.
- కాళ్ళలో చాలా వేడిగా అనిపించడం: మీ పాదాలు చాలా వేడిగా ఉన్నాయా? వాతావరణం మారుతున్న కొద్దీ వేడిగానూ, చల్లగానూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాళ్ళు వేడిగా అనిపిస్తే మధుమేహం స్థాయి ఎక్కువగా ఉందని అర్థం. కాబట్టి దీనిని చిన్న విషయంగా విస్మరించవద్దు.
- గోళ్ళ రంగు మారడం: మీరు గోళ్ళ రంగులో మార్పును మార్పు కనిపించినప్పటికీ, శ్రద్ధ వహించండి. గోళ్లు పసుపు రంగులో ఉంటే, శరీరంలో మధుమేహం స్థాయి చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. పైన పేర్కొన్న అన్ని పరిస్థితులను చాలా తీవ్రంగా పరిగణించాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ బారీన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
- గోళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం ఉన్నవారు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్లను ప్రభావితం చేస్తుంది. గోళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..