Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drumstick Benefits: మునక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా.? తెలిస్తే తినకుండా వదలిపెట్టే ప్రసక్తే ఉండదు..

చాలా ప్రాంతాలలో మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు. అందుకు దానిలోని పోషకాలు, దాని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే..

Drumstick Benefits: మునక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా.? తెలిస్తే తినకుండా వదలిపెట్టే ప్రసక్తే ఉండదు..
Drumsticks
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 24, 2023 | 5:06 PM

చాలా ప్రాంతాలలో మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు. అందుకు దానిలోని పోషకాలు, దాని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ కూడా ఒకటి. ఇక మునక్కాయ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉంటాయి. మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. మునగలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మునగ చెట్టు ఆకులు, కాయలని కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. మునగకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మధుమేహం నియంత్రణ: మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మునగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. డయాబెటీస్‌ ఉన్నవారికి ఇది చాలా మంచిది.
  2. రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటు ఉన్న రోగులకు మునక్కాయ చాలా మేలు చేస్తుంది. మునగలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను  మెరుగుపరచడమే కాక రక్తపోటును నియంత్రిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. గుండెకు ప్రయోజనకరం: మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలో చెడు కొలస్ట్రాల్‌ పేరుకుపోకుండా చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
  5. మెరిసే చర్మం: మునగ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. మునగలో ఉండే పోషకాలు మొటిమలను తొలగించడానికి పని చేస్తాయి.
  6. థైరాయిడ్‌ కంట్రోల్‌: ములక్కాడ తినడం వల్ల థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. మునగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపు సమస్యలని దూరం చేస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..