flaxseed health benefits: గుండెను కాపాడే అవిసె గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

అవిస గింజలను అందరూ ఇష్టపడటానికి మరో కారణం వాటి పోషక విలువలు. ఎందుకంటే అవిసె గింజలలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసిన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్, మ్యుసిలేజ్ వంటి పోషకాలెన్నో పుష్కలంగా ఉండి...

flaxseed health benefits: గుండెను కాపాడే అవిసె గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Flaxseed Health Side Effects
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 21, 2023 | 7:22 AM

అవిసె గింజలను తరచూ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవిసె గింజల రుచి, వాసనలను అనేక మంది ఇష్టపడతారు. వీటిని అందరూ ఇష్టపడటానికి మరో కారణం వాటి పోషక విలువలు. ఎందుకంటే అవిసె గింజలలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసిన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్, మ్యుసిలేజ్, విటమిన్ బి1, ప్రొటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, సెలీనియం, పీచు పదార్ధాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇన్ని రకాల ప్రయోజనాలను అందించే గింజల గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.

అయితే అవిసె గింజల గురించే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. మాత్రం అస్సలు వదిలిపెట్టరంటున్నారు నిపుణులు. ఇక ఈ అవిసె గింజలను రోజూవారి ఆహారంలో భాగంగా తీసుకుంటే.. ఎన్నో రకాల రోగాల నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యవంతంగా బలంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు అవిసె గింజలను వేయించి పొడి చేసి ఆహార పదార్ధాలలో కలుపుకొని తినవచ్చు. దీంతోపాటు పొడి చేసి నీటిలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక వీటిని నిత్యం తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు మేలు: ఈ అవిసె గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీంతో ఒమేగా-3, యాంటీ ఇన్ఫెమేటరీ స్వభావం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీనడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని.. హృదయ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

నొప్పులకు ఉపశమనం: కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలనకు అవిసె గింజలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల నొప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు.

జీర్ణక్రియ: అవిసె గింజలు రోజూ ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. ఉదరం సమస్యలను నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు కూడా తగ్గవచ్చు.

మధుమేహం: రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో అవిసెగింజలు బాగా సహాయపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడే అవకాశముండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

క్యాన్సర్ కారకాల నుంచి రక్షణ: పలు రోగాలకు సంజీవనిగా అవిసె గింజలు దోహదపడతాయి. పలు క్యాన్సర్ కారకాల ప్రమాదాలను అవిసె గింజలు అడ్డుకుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు