Kidney Problem: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..

కిడ్నీలు మన శరీరావయవాలలోని విష, వ్యర్థ పదార్థాలను రక్తం ద్వారా సేకరించి, వడపోసి, శరీరం నుంచి బయటకు పంపుతాయి. కిడ్నీలు ఈ పనిని చేయకపోతే మనల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు..

Kidney Problem: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..
ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు, లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వ‌ర‌కు కూడా అవి ఉన్నట్లు తెలియకపోవడంతో.. స‌మ‌స్య తీవ్రత‌ర‌మై ఆపరేష‌న్ వ‌ర‌కు దారి తీస్తోంది. అయితే ఆరంభంలోనే కిడ్నీలో ఉన్న రాళ్ల గురించి తెలుసుకునే వీలుంది. అదెలా అంటే శరీరంలో కలిగే కొన్ని లక్షణాల ద్వారా కిడ్నీలో రాళ్లున్న విషయాన్ని గుర్తించవచ్చు. మ‌రి కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించే ఆ ల‌క్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Follow us

|

Updated on: Jan 20, 2023 | 12:52 PM

మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో కిడ్నీకూడా ఒకటి. మన శరీర ఆరోగ్యం కిడ్నీ పనితీరుపై కూడా అధారపడి ఉంటుంది. కిడ్నీలు మన శరీరావయవాలలోని విష, వ్యర్థ పదార్థాలను రక్తం ద్వారా సేకరించి, వడపోసి, శరీరం నుంచి బయటకు పంపుతాయి. కిడ్నీలు ఈ పనిని చేయకపోతే మనల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వెంటాడతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ప్రస్తుత కాలంలోని ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మనం అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాం. ఇక వీటి ప్రభావం కిడ్నీల మీద కూడా పడుతోంది. ఫలితంగా మరిన్నీ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాం..

అయితే కిడ్నీలపై సరిగ్గా శ్రద్ధ పెట్టకపోతే.. కిడ్నీ ఇన్‌ఫెక్షన్, కిడ్నీఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక రోగాల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే కిడ్నీలో ఏ చిన్న సమస్య ఉందని తెలిసినా వెంటనే చికిత్స చేయించుకోవాలి. లేకపోతే అది కాస్తా విషమించే ప్రమాదముంటుంది. కిడ్నీల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి..? కొన్ని లక్షణాలను మన శరీరంలో గుర్తించడం ద్వారా కిడ్నీ సమస్యలు ఉన్నాయనే నిర్ధారణకు రావచ్చు. మరి ఆ లక్షణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ వ్యాధి లక్షణాలు:

  1. కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే క్రమంగా ఆకలి తగ్గిపోతుంది. అంతేకాకుండా వాంతులు, కడుపులో సమస్య, కడుపు తిప్పడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. బరువు కూడా తగ్గుతుంటారు.
  2. ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవితంలో నిద్ర సమస్య అందరికీ వేధిస్తోంది. ఇదొక సాధారణ సమస్యగా మారిపోయింది. చాలామంది తాము నిద్రపోదామనుకున్నా..గంటల తరబడి అటూ ఇటూ దొర్లుతుంటారు కానీ నిద్ర పట్టదు. ఇలాంటి పరిస్థితి తరచూ ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. నిద్రలేమి, క్రానిక్ కిడ్నీ రోగం మధ్య సంబంధముందని వివిధ అధ్యయనాల్లో తేలింది.
  3. కిడ్నీ అనేది శరీరంలోని విష పదార్ధాల్ని బయటకు పంపిస్తుంది. కిడ్నీ ఈ పని సరిగ్గా చేయకపోతే..ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. ఫలితంగా మెదడుకు అవసరమైన ఆక్సిజన్ అందదు. తల తిరగడం, ఏకాగ్రత లోపించడం, మెమరీ తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
  4. కండరాలు పట్టేసినట్టు ఉండటం కూడా కిడ్నీ వ్యాధి లక్షణమే. కాల్షియం, సోడియం, పొటాషియం ఇతర ఎలక్ట్రోలైట్స్ స్థాయి సరిగ్గా లేకపోతే ఈ సమస్య ఎదురవుతుంది. ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  5. శరీరంలోని విష పదార్ధాల్ని ఫిల్టర్ చేయడం కిడ్నీ పని. కిడ్నీ ఈ పని సరిగ్గా చేయకపోతే వివిధ సమస్యలు తలెత్తుతాయి. నోటి దుర్వాసన అధికమవుతుంది. రక్త సరఫరాలో విష పదార్ధాలు ఉండటం వల్ల తినే భోజనం రుచిగా కూడా ఉండదు.
  6. కిడ్నీ శరీరం నుంచి ఎక్కువగా ఉన్న సోడియంను బయటకు పంపించేస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీ సోడియం స్థాయిని పూర్తిగా బయటకు పంపించకపోతే అదంతా శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా కాళ్లు, ముఖం వాపు కన్పిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  7. కిడ్నీలు విషపదార్ధాల్ని వడపోసి శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. కిడ్నీ ఈ పని చేయడంలో విఫలమైతే.. విష పదార్ధాలు రక్తంతో పాటు ప్రవహిస్తాయి. ఫలితంగా శరీరంలోని వివిధ భాగాల్లో దురద వస్తుంది. కిడ్నీ..మినరల్స్, ఇతర పోషకాల్ని బ్యాలెన్స్ చేయకపోతే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. చర్మం కూడా ఎండిపోయినట్టు ఉంటుంది.
  8. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు శరీరంలో రెడ్ బ్లెడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఆ వ్యక్తి ఎనీమిక్‌గా మారిపోతాడు. దాంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
  9. కిడ్నీలు సహజసిద్ధమైన ఫిల్టర్‌లా పనిచేస్తాయి. ఈ ఫిల్టరేషన్ విఫలమైతే శరీరంలో విష పదార్ధాలు భారీగా పేరుకుపోతాయి. ఫలితంగా తీవ్రమైన అలసట వస్తుంది. బలహీనతతో పాటు ఏకాగ్రత కూడా లోపిస్తుంది.
  10. కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే మీ మూత్రం రంగు ద్వారా సులభంగా గుర్తించవచ్చు. మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా విసర్జితమౌతాయి. దీనినే ఆల్బూమిన్‌గా పిలుస్తారు. కిడ్నీలో సమస్య ఉన్నప్పుడు మూత్రం రంగు మారిపోతుంది. మూత్రం నుంచి రక్తం వస్తుంటే..కిడ్నీలో రాళ్లు, ట్యూమర్ లేదా ఇన్‌ఫెక్షన్ ఉందని అర్ధం.

పైవాటిలో ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే అవి దీర్ఘకాలికంగా వేధించే కిడ్నీ సమస్యలుగా మారే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..