Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infertility Issues: సంతానలేమితో బాధపడుతున్నారా? అసలు విషయం ఇదేంనంటోన్న నిపుణులు..

అండాశయాలు అనేవి స్త్రీ పునురుత్పత్తి వ్యవస్థలో భాగం. అవి ఆడవారి పెల్విస్ లో ఉంటాయి. ముఖ్యంగా గుడ్డు కణాలను పట్టుకోవడం, అలాగే హార్మోన్లు తయారు చేయడంలో ఉపయోగపడతాయి. అయితే అండశయం మీద ద్రవంతో కూడిన అండాశయ తిత్తులు ఏర్పడడం సర్వసాధారణం.

Infertility Issues: సంతానలేమితో బాధపడుతున్నారా? అసలు విషయం ఇదేంనంటోన్న నిపుణులు..
Period Cramp
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2023 | 1:15 PM

చాలా మంది మహిళలకు పిల్లలు పుట్టడం లేదని బాధపడుతుంటారు. అత్తింటి వారు, ఇరుగు పొరుగు వారితో మాటలు పడాల్సి వస్తుందని మనోవేదనకు గురవుతారు. మహిళలకు పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా అండాశయ సమస్యలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అండాశయాలు అనేవి స్త్రీ పునురుత్పత్తి వ్యవస్థలో భాగం. అవి ఆడవారి పెల్విస్ లో ఉంటాయి. ముఖ్యంగా గుడ్డు కణాలను పట్టుకోవడం, అలాగే హార్మోన్లు తయారు చేయడంలో ఉపయోగపడతాయి. అయితే అండశయం మీద ద్రవంతో కూడిన అండాశయ తిత్తులు ఏర్పడడం సర్వసాధారణం. ఈ తిత్తులు మహిళలకు సాధారణంగా ఎలాంటి ఇబ్బందులూ కలుగజేయవు. కొన్ని తిత్తులు ఎలాంటి చికిత్సా లేకుండా వాటంతట అవే తొలగిపోతాయి. కానీ మరికొన్ని మాత్రం చాలా ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా అండాశయ తిత్తుల సైజు బట్టి ఇబ్బందులు పెరుగుతాయి.

అండాశయ తిత్తుల లక్షణాలు

పెద్ద అండాశయ తిత్తుల వల్ల భరించలేని కటి నొప్పి, వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి అవి చీలిపోయి కటి లోపల రక్తస్రావానికి దారితీయవచ్చు. అలాగే పొత్తికడుపు వాపు, బాధాకరమైన సెక్స్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.  అలాగే హార్మోన్ల సమస్యలు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు తెలిసిన స్త్రీలు అండాశయ తిత్తులతో గుర్తించబడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా, పెల్విక్ ఇన్ఫెక్షన్లు, గర్భధారణ సమస్యలు వంటి సమస్యలతో బాధపడతారు. కొన్నిఅండాశయ తిత్తులు కడుపు నొప్పి, ఉబ్బరం, సక్రమం కాని రుతుక్రమం వంటి అసహ్యకరమైన లక్షణాలను కలిగిస్తాయి. రుతుస్రావం ఆలస్యం, రుతుస్రావం లేకపోవడం వంటి సమస్యలతో పాటు ప్రేగులలో ఆటంకాలు కూడా కలగవచ్చు. సిస్ట్‌లను సరైన సమయంలో నిర్వహించకపోతే అండాశయాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలున్న స్త్రీ వెంటనే వైద్యులను సంప్రదించాలి.

రోగ నిర్ధారణ, చికిత్స

సోనోగ్రఫీ అండాశయ తిత్తుల సమస్యను నిర్ధారించడంలో సాయపడుతుంది. అలాగే అల్ట్రా సౌండ్ స్కానింగ్ తో కూడా తిత్తులను గుర్తించే అవకాశం ఉంది. టెస్టుల అనంతరం డాక్టర్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి చికిత్సను ప్రారంభిస్తారు. ముఖ్యంగా గైనకాలిజిస్ట్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చేలా కృషి చేస్తారు. కాబట్టి తరచూ వైద్యుల సలహాలను పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI
ఇంట్లో గొడవలా.. వెంటనే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పండి..
ఇంట్లో గొడవలా.. వెంటనే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పండి..
సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు
సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు
ఈవారం థియేటర్స్‌లో దుమ్మురేపే మూవీస్ ఇవే..
ఈవారం థియేటర్స్‌లో దుమ్మురేపే మూవీస్ ఇవే..
ఇరకాటంలో 'దోస్త్' ఆన్‌లైన్ వ్యవస్థ.. కన్వినర్ నియామకం ఇంకెప్పుడో?
ఇరకాటంలో 'దోస్త్' ఆన్‌లైన్ వ్యవస్థ.. కన్వినర్ నియామకం ఇంకెప్పుడో?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల భవిష్యత్తుపై షాకింగ్ అప్‌డేట్!
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల భవిష్యత్తుపై షాకింగ్ అప్‌డేట్!
ఉగాది స్పెషల్ గా మామిడి కాయ పులిహోర ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం
ఉగాది స్పెషల్ గా మామిడి కాయ పులిహోర ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం
కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపం తగులుతుంది.. నటుడి హెచ్చరిక
కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపం తగులుతుంది.. నటుడి హెచ్చరిక
అటు ఎండ, ఇటు వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం..
అటు ఎండ, ఇటు వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం..