AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Spices for Health: డయాబెటీస్, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా..? వాటిని సులభంగా నియంత్రించండిలా..!

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంకా అనేక మంది చిన్న వయసు నుంచి డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో

Indian Spices for Health: డయాబెటీస్, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా..? వాటిని సులభంగా నియంత్రించండిలా..!
Foods For Diabetes And Bad Cholesterol
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 27, 2023 | 7:46 PM

Share

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంకా అనేక మంది చిన్న వయసు నుంచి డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధానం కారణమని తప్పక చెప్పుకోవాలి. మరి గుండె సమస్యలకు కారణమైన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడానికి మన వంటగదిలోని మసాలా దినుసులు ఎంతగానో సహకరిస్తాయని మీకు తెలుసా..? అవును నిజమే. మన వంటగదిలో ఉండే పసుపు, మరియాలు, లవంగం, ధనియాలు వంటి పలు రకాల మసాలా దినుసులు మనల్ని ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అంతేకాక శరీర వ్యాధినిరోధక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తాయి. ఇంకా ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు మధుమేహాన్ని నియంత్రించడంలోనూ చక్కగా పనిచేస్తాయి. మరి ఏయే సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులు మన కొలెస్ట్రాల్‌ను, షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పసుపు: ఇది రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో పసుపును తప్పకుండా చేర్చుకుంటే షుగర్‌ను కంట్రోల్ చేయడంలో మంచి ఫలితాలను పొందవచ్చు. అందుకోసం ఒక గ్లాసు నీటిలో చిటికెడు పసుపును వేసి కూడా తీసుకోవచ్చు.
  2. నల్ల మిరియాలు: నల్ల మిరియాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా ఇవి జలుబు, ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో ఉపకరిస్తాయి. క్రమం తప్పకుండా మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది.
  3. లవంగం: ఇది ఇన్సులిన్ నిరోధక లక్షణాలు, అనాల్జేసిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది.
  4. దాల్చినచెక్క: దాల్చినచెక్కలో యాంటీమైక్రోబయాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దాల్చిన చెక్క మన అంతర్గత వ్యవస్థలో ఏదైనా అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ మెరుగుపరచడానికి, శరీరమంతా రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మెంతులు: మెంతుల్లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది శరీరానికి తక్కువ కార్బోహైడ్రేట్లను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియ మందగించడం, శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మీరు మెంతి నీటిని ప్రతిరోజూ ఉదయం తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అదిస్తుంది.
  7. తులసి: తులసి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తులసి సహాయపడుతుంది. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తులసి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..