AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Fiber Foods: ఆరోగ్యాన్ని కాపాడే ఫైబర్ కావాలంటే.. తీసుకోవలసిన ఆహార పదార్థాలివే.. తింటే మెరుగైన జీర్ణవ్యవస్థ కూడా..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో తగుపాళ్లలో పోషకాలు ఉండడం తప్పనిసరి. ప్రస్తుత అధునిక ప్రపంచంలో బిజీ బిజీ లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఆహారంపై..

High Fiber Foods: ఆరోగ్యాన్ని కాపాడే ఫైబర్ కావాలంటే.. తీసుకోవలసిన ఆహార పదార్థాలివే.. తింటే మెరుగైన జీర్ణవ్యవస్థ కూడా..
Foods For Fiber
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 26, 2023 | 8:30 PM

Share

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో తగుపాళ్లలో పోషకాలు ఉండడం తప్పనిసరి. ప్రస్తుత అధునిక ప్రపంచంలో బిజీ బిజీ లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఆహారంపై సరైన శ్రద్ధ వహించడంలేదు. ఆ కారణంగానే చాలా మంది డయాబెటీస్, స్థూలకాయం, బీపీ, అల్సర్స్, మలబద్ధకం, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మన జీర్ణవ్యవస్థ పనితీరు సవ్యంగా సాగాలి. ఆ క్రమంలో మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండడం చాలా ముఖ్యం. ఫైబర్ ఉండే ఆహారం జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్ ఫుడ్ తినడం వలన జీర్ణ ప్రక్రియకు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు.. పీచు పదార్థాలు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తాయి. మరి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఫైబర్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి. మరి అధిక ఫైబర్ కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పీచు అధికంగా వుండే ఆహార పదార్ధాలు:

  1. ధాన్యాలు: సాధారణంగా మనం తీసుకునే ధాన్యాలలో కావలసినంత పీచు వుంటుంది. బియ్యం, గోధుమ, జొన్న, పప్పులు, ఓట్లు పీచు అధికంగా వుండే పదార్ధాలు. ఇవి మన శరీరానికి కావలసిన మెగ్నీషియం, బి 6 విటమిన్ కూడా అందిస్తాయి. ఇవి కనుక ముతక ధాన్యాలైతే (పాలిష్ కానివి), పీచు మరింత అధికంగా కూడా వుంటుంది. తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి.
  2. బీన్స్: పీచు పదార్థాలకు బీన్స్ చాలా మంచి ఆహారం. వీటిని వండిన తర్వాత కూడా పీచు కలిగి వుంటాయి. ఫ్రెంచి బీన్స్, కిడ్నీ బీన్స్ ఏవైనప్పటికి మంచిదే.
  3. బెర్రీ పండ్లు: సాధారణంగా అందరూ వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమే ఉన్నాయనుకుంటారు. కానీ వీటిలో పీచు కూడా అత్యధికంగా వుంటుంది. కనుక స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి బాగా తినడం మంచిది.
  4. పచ్చని ఆకు కూరలు: గోంగూర, బచ్చలి, మెంతి, కరివేప మొదలైన పచ్చని ఆకు కూరలలో కూడా పీచు అధికంగా వుంటుంది. కనుక తినే ఆహారంలో ఆకు కూరలు ప్రధానంగా వుండాలి.
  5. డ్రై ఫ్రూట్స్: సైజులో చిన్నవైనప్పటికి ఇవి పీచు అధికంగా కలిగి వుంటాయి. కొద్దిపాటిగా తింటే చాలు వాటిలో వున్న కొవ్వు, ప్రొటీన్లు అధిక శక్తినిస్తాయి. కనుక ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తినండి.
  6. అరటిపండు: అరటిపండులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అరటి పండులో పొటాషియం, ఐరన్ మూలకాలు కూడా అధికంగా ఉంటాయి. అరటి పండు, ఓట్స్‌తో జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు.
  7. వోట్స్: ఫైబర్ ఫుడ్‌లలో వోట్స్ కీలకం అని చెప్పాలి. ఓట్స్‌ని వివిధ రకాలుగా వండుకుని తినవచ్చు. ఉప్మా నుంచి ఓట్స్ గ్రానోలా బార్‌ల వరకు వివిధ రకాలుగా చేసుకుని ఆరగించవచ్చు. ముఖ్యంగా ఓట్స్‌తో చేసిన ఆహారాన్ని ఉదయం సమయంలో తినడం ఉత్తమం. ఓట్స్ తినడం ద్వారా శరీరంలో కేలరీలు తగ్గి.. అధిక బరువును నియంత్రించవచ్చు.
  8. అవిసె గింజలు: అవిసెల్లో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యూలర్ డైట్‌లో అవిసె గింజలను చేరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని రైతాలో కూడా కలిపి తీసుకోవచ్చు.
  9. యాపిల్స్, పియర్స్:యాపిల్స్, పియర్స్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తొక్కతో సహా తినాలి. ఆ తొక్కలోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. సలాడ్‌లో వీటిని కలిపి తినవచ్చు.
  10. బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని వండుకుని తినాలి. పరోటా, చపాతీ, ఇతర ఫుడ్‌తో కలిపి తినొచ్చు. దీనిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతోంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us