Healthy Digestive System: ఈ సులభమైన 5 పద్ధతులను పాటిస్తే.. మెరుగైన జీర్ణవ్యవస్థ మీ సొంతం.. ఏం చేయాలంటే..

ఈ ఆధునిక ప్రపంచంలో మనం అలవాటు పడిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. వాటి కారణంగానే చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం

Healthy Digestive System: ఈ సులభమైన 5 పద్ధతులను పాటిస్తే.. మెరుగైన జీర్ణవ్యవస్థ మీ సొంతం.. ఏం చేయాలంటే..
Healthy Digestive System
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 26, 2023 | 8:05 PM

ఈ ఆధునిక ప్రపంచంలో మనం అలవాటు పడిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. వాటి కారణంగానే చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా అజీర్తి సమస్యలతో బాధపడేవారు కూడా లేకపోలేదు. ఇన్ని ఆరోగ్య సమస్యలకు కారణం మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లే కారణమని తెలిసినా చాలామంది తమ తీరును మార్చుకోవడంలేదు. ఈ క్రమంలో మన ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది మన జీర్ణవ్యవస్థ. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏదైనా కొంచెం ఆహారం తిన్నా గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపునొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం కొన్ని పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. మరి ఎటువంటి పద్దతులను పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పీచు పదార్థాలు: ఫైబర్ లేదా పీచు ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను తినాలని పోషకాహార, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటివల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ అంటూ రెండు రకాలు ఉంటాయి. ఇవి మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి.
  2. పూర్తిగా నమలడం: బిజీ షెడ్యూల్, ఉద్యోగ బాధ్యతల కారణంగా చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలడం లేదు. దీంతో ఆ పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. ఆరోగ్య కరమైన జీర్ణ వ్యవస్థ కోసం మీరు ఆహారాన్ని మెత్తగా నమలాలి. అప్పుడే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
  3. మెరుగైన జీవనశైలి: మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర, ఆహార నియమాలు వంటివి మార్చుకోవాలి.
  4. మాంసాహారానికి దూరం: జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. కొవ్వులు ఎక్కువ లేకుండా ఉండే మాంసం తినాలి. రెడ్ మీట్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకానికి కూడా దారి తీస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఆహారంలో చికెన్ వంటివి చేర్చాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. తగినంత నీరు: ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం తరచూ నీరు తాగాలి. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..