- Telugu News Lifestyle Food As per Experts To avoid these health problems and to get Health benefits should eat fenugreek Leaves daily
Benefits of Methi Leaves: ఈ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే.. మెంతి కూర తినాల్సిందే..
Benefits of Methi: శీతాకాలంలో మెంతి కూర మార్కెట్‌లో చాలా తాజాగా,ఎక్కువగా లభిస్తుంది. మెంతికూరతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. మెంతులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మెంతికూరను తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 26, 2023 | 7:25 PM

Benefits of Methi: శీతాకాలంలో మెంతి కూర మార్కెట్‌లో చాలా తాజాగా,ఎక్కువగా లభిస్తుంది. మెంతికూరతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. మెంతులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మెంతికూరను తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మెంతికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మెంతికూరలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఫలితంగా మెంతులు, మెంతికూర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.

చాలా మంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయట పడేందుకు మెంతి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది: మెంతి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.

బరువు తగ్గడం:మెంతి ఆకులను నమలడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి మెంతులు చాలా ఉత్తమం.బరువు తగ్గాలని ఆలోచిస్తున్నవారు తమ ఆహారంలో మెంతి ఆకులను చేర్చుకోవచ్చు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ఇందువల్ల ఉదయం 10 నుంచి 12 మెంతి ఆకులను నోటిలో వేసుకుని నమలడం మంచిది.

బ్లడ్ షుగర్ నియంత్రణ: మెంతి ఆకులకు బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసే శక్తి ఉంది. మెంతుల్లో మంచి మొత్తంలో ఉన్న పీచు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం సమస్య ఉన్నవారు ఆహారంలో మెంతికూరను చేర్చుకోవాలి. మెంతి ఆకులు ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తాయి.

మెరుగైన జీర్ణవ్యవస్థ: ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఉదయం మెంతి ఆకులను నమలడం ప్రారంభించడం మంచిది. మెంతి ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకా అనేక కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది.





























