Food: రొటీన్‌ స్నాక్స్‌ తిని, తిని బోర్‌ కొడుతోందా.? ఈ ఆలూ చీజ్‌ బాల్‌ రెసిపినీ ట్రై చేయండి, లొట్టలేసుకొని తింటారు.

అసలే చలి కాలం, సాయంత్రం స్నాక్స్‌ రూపంలో అలా వేడి వేడిగా ఏవైనా తింటే ఆ మజానే వేరు కదూ! అయితే వేడి వేడి స్నాక్స్‌ అనగానే ఎవరికైనా మిర్చీలు, బజ్జీలే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడూ ఇలాంటి రోటీన్‌ స్నాక్స్‌ తీసుకుంటే బోర్‌ కొట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లలు నిత్యం ఏదో ఒక కొత్త స్నాక్స్‌ కోరుకుంటారు...

Food: రొటీన్‌ స్నాక్స్‌ తిని, తిని బోర్‌ కొడుతోందా.? ఈ ఆలూ చీజ్‌ బాల్‌ రెసిపినీ ట్రై చేయండి, లొట్టలేసుకొని తింటారు.
Aloo Cheese Balls
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 26, 2023 | 6:13 PM

అసలే చలి కాలం, సాయంత్రం స్నాక్స్‌ రూపంలో అలా వేడి వేడిగా ఏవైనా తింటే ఆ మజానే వేరు కదూ! అయితే వేడి వేడి స్నాక్స్‌ అనగానే ఎవరికైనా మిర్చీలు, బజ్జీలే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడూ ఇలాంటి రోటీన్‌ స్నాక్స్‌ తీసుకుంటే బోర్‌ కొట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లలు నిత్యం ఏదో ఒక కొత్త స్నాక్స్‌ కోరుకుంటారు. మీ ఇంట్లో కూడా కొత్తగా ఏదైనా చేయమంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? అయితే మీ కోసమే ఈ సరికొత్త రెసిపీనీ తీసుకొస్తున్నాం. ఇంట్లో దొరికే వస్తువులతో ఎంచక్కా రుచికరమైన అలూ చీజ్‌ బాల్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి.? తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

* రెండు నుంచి నాలుగు బంగారు దుంపలు

ఇవి కూడా చదవండి

* 1 గిన్నె సన్నగా తరిగిన ఉల్లిపాయలు

* 1 నుంచి 2 సన్నాగా పచ్చిమిర్చి

* 2 టేబుల్‌ స్పూన్లు తుమిని చీజ్‌

* 1 చిన్న గిన్నె తరిమిన క్యాప్సికమ్‌

* 1 టీస్పూన్‌ చిల్లీ ఫ్లేక్స్‌

* ఉప్పు రుచికి తగినంతా

* 1 టీస్పూన్‌ కస్తూరి మెంతి

* 1/2 టీస్పూన్‌ గరం మసాలా

* సన్నగా తిరిగిన చీజ్‌ క్యూబ్స్‌, కొత్తిమీర ఆకులు

* రెండు చెంచాల కార్న్‌ ఫ్లోర్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌, నూనె

తయారీ విధానం..

ఇందుకోసం ముందుగా బంగాళదుంపను ఉడకబెట్టి బాగా మెత్తగా స్మాష్‌ చేసుకోవాలి. అనంతరం ఉల్లిపాయ, కారం, క్యాప్సికమ్, కొత్తిమీర తరుగు, ఉప్పు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, కస్తూరి మెంతి, తురిమిన చీజ్ వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు బంగాళదుంపలను చిన్న బాల్స్‌గా చేసి ఉంచుకోవాలి. తర్వాత బంగాళదుంపలతో చేసిన బాల్స్ లోపల చీజ్ క్యూబ్స్ ఉంచండి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ పౌడర్, కొద్దిగా నీరు వేసి పిండిని తయారు చేయండి. కొన్ని బ్రెడ్ నుండి బ్రెడ్ ముక్కలను సిద్ధం చేయండి, ఇప్పుడు ఒక బంతిని కార్న్‌ఫ్లోర్‌తో పాటు పిండితో చేసుకున్న లిక్విడ్‌లో ముంచి, ఆపై బ్రెడ్‌ ఫ్లేక్స్‌కి అద్ది.. నూనెలో వేయించాలి. గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి సాస్‌తో సర్వ్‌ చేసుకుంటే సరి.

మరిన్ని ఫుడ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!