AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో తెలుసా..? తెలిస్తే తినకుండా ఉండలేరు..

నిత్యం అనుభవిస్తున్న మానసిక ఒత్తిళ్లు, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి.. ఇలా వివిధ కారణాల వల్ల మనిషి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాడు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పెద్దలు అంటుంటారు. ఎలప్పుడూ ఆరోగ్యకరంగా

Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో తెలుసా..? తెలిస్తే తినకుండా ఉండలేరు..
Dragon Fruit Health Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 29, 2023 | 9:43 AM

Share

నిత్యం అనుభవిస్తున్న మానసిక ఒత్తిళ్లు, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి.. ఇలా వివిధ కారణాల వల్ల మనిషి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాడు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పెద్దలు అంటుంటారు. ఎలప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాల పండ్లు తినాలి. ప్రతీ రోజూ ఓ పండు అయినా తినడం ఆరోగ్యానికి మంచిదని, పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక అవన్నీ దొరికే సూపర్ ఫ్రూట్‌లలో ‘డ్రాగన్ ఫ్రూట్’ కూడా ఒకటి. గులాబీ రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్‌లో తెల్లటి గుజ్జు, నల్లటి విత్తనాలు ఉంటాయి. ఇక ఈ ఫ్రస్తుత కాలంలో ప్రతి మార్కెట్‌లోనూ లభిస్తుంది. మరి డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కేలరీలు తక్కువ-ఖనిజాలు ఎక్కువ

డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా, ఖనిజాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు కూడా లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వ్యాధులను దూరం చేసే పండు

ప్రస్తుతమున్న కాలంలో మనిషి తాను పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా రోగనిరోధక శక్తిని కోల్పోతున్నాడు. ఈ ఫ్రూట్‌ తింటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వివిధ రకాల వ్యాధులు దరి చేరనివ్వకుండా నుంచి కాపాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో నేచురల్‌గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ డ్రాగన్‌ పండులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యునిటీని పెంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ ను కాపాడటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీంతో అంటువ్యాధులు గానీ ఇతర ఏ జబ్బులు గానీ మన దరి చేరకుండా చూస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఆక్సీజన్ అవసరం. ఒంటి నిండా ప్రాణ వాయువు సరఫరా కావాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. మిగతా అన్ని పండ్లతో పోల్చితే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫలంలోనే. బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..