- Telugu News Photo Gallery Never combine these foods with tea, know why chai can be dangerous for your stomach
Tea Side Effects: ఈ ఫుడ్స్‌ను ‘టీ’తో అస్సలు తినొద్దు.. తింటే డేంజర్‌లో పడ్డట్టే!
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ 'టీ' చాలా అవసరం. వారి అలసట నుంచి కాస్త రిలీఫ్‌ను ఇస్తుంది ఈ పానీయం. మరికొందరైతే 'టీ'తోనే రోజు ప్రారంభమవుతుంది.
Updated on: Jan 28, 2023 | 6:54 PM

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ 'టీ' చాలా అవసరం. వారి అలసట నుంచి కాస్త రిలీఫ్‌ను ఇస్తుంది ఈ పానీయం. మరికొందరైతే 'టీ'తోనే రోజు ప్రారంభమవుతుంది. ఇంకొందరైతే రోజుకు రెండు లేదా మూడు సార్లు 'టీ' తాగుతుంటారు. ఇక ఆఫీస్‌లో పని చేసేవారికైతే వర్క్ నుంచి ఉపశమనం పొందేందుకు 'టీ' కంపల్సరీ. ఇదిలా ఉంటే.. కొందరు టీతో పాటు ఇష్టమొచ్చిన స్నాక్స్ తింటారు. అలా ఏది పడితే అది 'టీ'తో పాటు తినకూడదు. తింటే డేంజర్‌లో పడినట్లే.. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా.?

ఐరన్ ప్యాక్డ్ ఫుడ్స్: ఆకుకూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను వేడి వేడి కప్పు టీతో తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీలో టానిన్స్, ఆక్సలేట్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆయా ఫుడ్స్‌లోని ఐరన్‌ను శరీరానికి అందకుండా చేస్తాయి.

నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, టీతో నిమ్మకాయను కలపకూడదు. సాధారణంగా లెమన్ టీ అనేది బరువు తగ్గించే చిట్కాగా అందరూ భావిస్తారు. అయితే టీ ఆకులను నిమ్మకాయతో నేరుగా కలపడం వల్ల అధిక ఆమ్లత్వం, త్రేనుపు, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు వస్తాయి. ఎసిడిటీతో బాధపడుతున్నవారు ఉదయమే లెమన్ టీ తాగితే.. ఇకపై తగ్గించండి.

పసుపు: టీతో పాటు పసుపు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినవద్దు. ఈ రెండు కలిసినప్పుడు రసాయన ప్రతిచర్య ఉంటుంది. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.

పకోడీ: చాయ్‌తో పాటు పకోడీ అస్సలు తినకూడదు. అలా తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.

చల్లటి పదార్ధాలు: టీతో పాటు చల్లటి పదార్ధాలను అస్సలు తినకూడదు. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల వికారం, మైకం, జీర్ణక్రియపై చెడు ప్రభావం పడటం లాంటివి ఏర్పడతాయి.




