Dark Circles: కంటి కింద నల్లని వలయాలతో బాధపడుతున్నారా..? వాటికి చెక్ పెట్టేయండిలా..

ఒకప్పుడు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి మాత్రమే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామందిని..

Dark Circles: కంటి కింద నల్లని వలయాలతో బాధపడుతున్నారా..? వాటికి చెక్ పెట్టేయండిలా..
Remedy For Dark Circles
Follow us

|

Updated on: Jan 29, 2023 | 12:02 PM

ఒకప్పుడు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి మాత్రమే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. లైఫ్‌ స్టైల్‌లో మార్పులు కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని రకాల అలర్జీలు, నిద్రలేమి, డీహైడ్రేషన్, వృద్ధాప్యం, జన్యువులు డార్క్ సర్కిల్స్‌కు కారణాలుగా చెప్పుకోవచ్చు. కాలుష్యం, పోషకాహార లోపం, స్మోకింగ్, డ్రింకింగ్, ఒత్తిడి కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కారణం ఏదైనా వచ్చిన నల్లని మచ్చలను తొలగించుకోవడానికి ట్రీట్‌మెంట్ అంటూ బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతున్నాం. ఇక దొరికిందే చాన్స్ అని బ్యూటీషియన్లు కూడా బాగానే దండుకుంటున్నారు. వారు ట్రీట్‌మెంచ్ చేసినా చాలామందిలో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోవడంలేదు.

అయితే ఆ ట్రీట్‌మెంట్లకు ప్రత్యామ్నాయంగా A, B, C, E విటమిన్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకుంటే కళ్ల చుట్టూ ఉన్న చర్మం కాంతిని కోల్పోకుండా ఉంటుంది. ఈ పోషకాలు సెన్సిటివ్ స్కిన్‌కు సాంత్వన చేకూరుస్తాయి. కంటి కింద మచ్చలతో వ్యక్తుల వయసు పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో చాలామంది ఇతరులను కలవడానికే ఆసక్తి చూపించరు. అయితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలనే ఆహారంలో భాగం చేసుకుంటే డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పుచ్చకాయ: కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుచ్చకాయ నుంచి శరీరానికి పుష్కలంగా అందుతుంది. అలాగే పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం; B1, B6, C విటమిన్లు, ఇతర పోషకాలు డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టగలవు
  2. బీట్‌రూట్: బీట్‌రూట్‌లో బీటాలైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అయితే బీట్‌రూట్ కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. దీంట్లో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటివన్నీ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. టమాటాలు: టమోటాలు విటమిన్ C, పొటాషియం, విటమిన్ K వంటి పోషకాలకు నిలయాలు. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మానికి రక్త ప్రసరణ బాగుంటుంది. వీటిలో లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్త నాళాలను సంరక్షిస్తుంది. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ఫలితంగా డార్క్ సర్కిల్స్ నయం అవుతాయి.
  5. బొప్పాయి: ఈ పండ్లలో విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది. అనేక యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్‌ దీని సొంతం. అందుకే బొప్పాయి కంటి కింద నల్లటి వలయాలను తగ్గించే బెస్ట్ ఫుడ్‌గా నిలుస్తోంది. ఇది చర్మాన్ని క్లియర్ చేయడంతో పాటు కళ్ల చుట్టూ ఉన్న డార్క్ ప్యాచ్‌లను తొలగించే నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.
  6. దోసకాయ: దోసకాయలలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. దోసకాయను ఆహారంలో చేర్చుకుంటే, కాంతివిహీనంగా మారిన చర్మం తిరిగి మెరుపును సంతరించుకుంటుంది. ఇది కొల్లాజెన్ ఏర్పడటాన్ని మెరుగుపరుస్తుంది. వీటిలో A, E, C, K విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తనాళాలను శుద్ధి చేస్తాయి. అందుకే దోసకాయలను క్రమం తప్పకుంటా తింటే, డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది.
  7. గ్రీన్ వెజిటెబుల్స్: ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే, శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా చర్మం హెల్దీగా ఉంటూ రీఫ్రెష్ అవుతుంది. పాలకూర, బచ్చలికూర, బ్రకోలీ వంటి వాటిలో విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచి.. చర్మ రంగు పాలిపోవడాన్ని, కళ్ల కింద ఉబ్బులను తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..