Woman Health: పెళ్లైన స్త్రీలు బరువు పెరగడానికి గల కారణాలివే.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
పెళ్లి అయిన అమ్మాయిలు అంతవేగంగా బరువు పెరిగిపోవడానికి కారణాలేమిటి..? మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా..? పెళ్లి అయిన అమ్మాయిలు ఆ సంవత్సరం లోపే బరువు పెరగడానికి
వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా ముఖ్యమైన భాగం. ముఖ్యంగా అమ్మాయిలు తమ పెళ్లి విషయంలో చాలా కలలు కంటారు. పెళ్లిరోజు స్లిమ్‌గా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ పెళ్లయిన తర్వాత అమ్మాయిల బరువు ఒక్కసారిగా పెరుగుతుంది. చాలా మంది అమ్మాయిలు పెళ్లయిన నెలలోనే ఊబకాయం బారినపడుతారు. అలాంటి ఘటనలను మనం కూడా చూస్తూనే ఉంటాం. అయితే వారు అంతవేగంగా బరువు పెరిగిపోవడానికి కారణాలేమిటి..? మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా..? పెళ్లి అయిన అమ్మాయిలు ఆ సంవత్సరం లోపే బరువు పెరగడానికి గల కారణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- పెళ్లికి ముందు ఆడపిల్లలు డైట్, వ్యాయామం చేస్తూ తన బరువుని కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఎందుకంటే తనకు కాబోయే భర్తకు నచ్చాలని వారు ఆరాటపడుతారు. కానీ వివాహం అయిన వెంటనే వారు తమ డైట్‌ని వదిలిపెట్టి.. రిలాక్స్ అవుతారు. ఇన్ని రోజులు చేసిన డైట్ ఒక్కసారిగా వదిలివేయడంతో ఆ ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. దీంతో బరువు పెరుగుతారు.
- పెళ్లి తర్వాత అమ్మాయిలు తరచుగా ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. అంతేకాకుండా బంధువుల ఇంటికి వెళ్లడం పూజలు, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. దీంతో శారీరక శ్రమలపై శ్రద్ధ చూపలేరు. దీని కారణంగా కడుపు, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
- పెళ్లి రోజు నుంచి చాలా రోజుల వరకు ఆచారాల పేరమీద చాలా పార్టీలు జరుగుతాయి. ఈ సమయంలో బంధువుల ఇంటికి వెళ్లడం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అమ్మాయిలు అనారోగ్యకరమైన ఆహారం, కొవ్వు అధికంగా ఉండే మాంసాహారాలు తింటారు. దీంతో ఒక్కసారిగా బరువు పెరుగుతారు.
- పెళ్లయ్యాక అమ్మాయిలు జాబ్ చేసినట్లయితే అదనపు బాధ్యతల వల్ల టెన్షన్ పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారని చాలా పరిశోధనల్లో రుజువైంది.
- పెళ్లయిన వెంటనే కుటుంబాన్ని చూసుకోవడం వల్ల మహిళలు చాలా బిజీ అయిపోతారు. దీని వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. తక్కువ నిద్ర కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. అంతేకాకుండా శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇది కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..