Chiranjeevi: అందుకే ఆయన మెగాస్టార్.. 29 రోజులలో సినిమా షూటింగ్ పూర్తి.. 500 రోజులు రన్నింగ్.. ఆ సినిమా ఏదంటే..

చిరంజీవి.. ఆ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ దిగ్గజ కథానాయకులలో అగ్రశ్రేణి నటుడు మెగాస్టార్ చిరంజీవి. విలన్ పాత్రలతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కొణిదెల..

Chiranjeevi: అందుకే ఆయన మెగాస్టార్.. 29 రోజులలో సినిమా షూటింగ్ పూర్తి.. 500 రోజులు రన్నింగ్.. ఆ సినిమా ఏదంటే..
Chiranjeevi
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 31, 2023 | 11:46 AM

చిరంజీవి.. ఆ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ దిగ్గజ కథానాయకులలో అగ్రశ్రేణి నటుడు మెగాస్టార్ చిరంజీవి. విలన్ పాత్రలతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్.. మెగాస్టార్‌ చిరంజీవిగా ఎదిగే క్రమంలో ఎన్నో హిట్‌లను ప్లాప్‌లను రుచి చూశారు. మరి ఆ క్రమంలోనే చిరంజీవి నటించిన ఒక సినిమా కేవలం 29 రోజులలోనే పూర్తయిందని.. 500 పైగా రోజులు ఆడిందని మీకు తెలుసా..? కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1982లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాధవి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కే రాఘవ నిర్మించిన ఈ సినిమానే. దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావుకు తొలి చిత్రం. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఏకంగా 512 రోజులు ఆడింది. చిరంజీవి కెరీర్‌కి ఈ చిత్రం మరో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు

దర్శకుడు ఈ చిత్రంలో చిరంజీవి ఇమేజ్‌ని భిన్నంగా చూపించడమే కాక.. కేవలం 29 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేశారు. విడుదలైన తర్వాత యావరేజ్ టాక్‌తో జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 3 లక్షల 25 వేల రూపాయలతో ఈ సినిమా షూటింగ్‌ని పాలకొల్లు, నరసాపురం, సఖినేటిపల్లి, పోడూరు, భీమవరం, మద్రాస్‌లలో జరిపారు. సినిమా పనులు పూర్తయ్యాక సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న రాఘవ పట్టుదలతో పోరాడి సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇక చిత్రం విడుదలయ్యాక ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు, 2 కేంద్రాలలో వంద రోజులు ఆడి మంచి కలెక్షన్స్ రాబట్టింది.

హైదరాబాద్ సిటీలో అయితే ఈ సినిమా ఏకంగా 512వ రోజు వరకు ఆడిందంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో భార్యపై ప్రేమని చూపిస్తూనే.. ఇంటి బయట అడుగుపెట్టగానే మరో స్త్రీ కోసం వెంపర్లాడిన మగాడి జీవితాన్ని ఈ మూవీ ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రంతో చిరంజీవి యాక్షన్ హీరో గానే కాకుండా ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలను షూటింగ్ చేయాలన్న చాలా సమయం తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే ఏకంగా ఏడాది, రెండేళ్ల సమయం షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ ఈ సినిమా కేవలం 29 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిందంటే అతిశయోక్తి కాదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..