AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli Family-BJP: రాజమౌళి కుటుంబంపై బీజేపీ ఫోకస్ పెట్టిందా..? అందుకేనా ఇవన్నీ..? తెలుసుకుందాం రండి..

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఇండస్ట్రీలోనే..

Rajamouli Family-BJP: రాజమౌళి కుటుంబంపై బీజేపీ ఫోకస్ పెట్టిందా..? అందుకేనా ఇవన్నీ..? తెలుసుకుందాం రండి..
Rajamouli And Keeravani
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Venkata Chari

Updated on: Jan 29, 2023 | 12:36 PM

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తుంది. అయితే కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ అండదండలు రాజమౌళి ఫ్యామిలీకి పుష్కలంగా ఉన్నాయనే మాటలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అందుకు పద్మ పురస్కారాలు, రాజ్యసభ సీటునే సోదాహరణగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరిపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టిందని సినీ ఇండస్ట్రీలో కూడా గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి.  ఇక 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది కేంద్రంలోని బీజేపీ. అయితే కీరవాణి కంటే ఏడేళ్ల ముందే రాజమౌళి పద్మశ్రీ అందుకున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 2016లోనే రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ఇచ్చింది

ఈ రెండు మాత్రమే కాక.. రాజమౌళి తర్వాత ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా.. గతేడాదిలో బీజేపీ నామినేట్ చేసిన సంగతి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ రాజ్యసభకు ఎంపిక చేసిన సమయంలో చాలా మంది బీజేపీని విమర్శించారు. అయినప్పటికీ బీజేపీ వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్లింది. అదే క్రమంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్ఎమ్ కీరవాణిని పద్మశ్రీ అవార్డు కోసం నామినేట్ చేసి.. ప్రదానం చేసింది బీజేపీ. వీటన్నింటినీ సమీక్షించిన రాజకీయ విశ్లేషకులు.. రాజమౌళి కుటుంబంపై బీజేపీ గట్టి ఫోకస్ పెట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, ఇంటర్నేషనల్ లెవెల్‌లో భారతీయ పరిశ్రమ సత్తాను చాటుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వెనుక కూడా ఈ ముగ్గురూ ఉన్నారు. దీంతో కేంద్రం ఈ ఫ్యామిలీపై స్పెషల్ ఫోకస్ చేసిందనే టాక్ ఇండస్ట్రీలోనూ నడుస్తోంది. ఏది ఏమైనా.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లిందంటే దానికి కారణం రాజమౌళి ఫ్యామిలీనే. ఇప్పుడు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమాకు అస్కార్ వరించాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి