Cyber Security: మీ ఫోన్‌లో ఇలాంటి అలెర్ట్ కనిపిస్తే.. మీ మొబైల్‌ను ఎవరో ట్యాప్ చేసినట్లే..! ఎలా గుర్తించాలంటే..

సైబర్ మోసాలు విపరీతంగా పెరిగినపోయిన ప్రస్తుత కాలంలో మన వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా ఉంది. రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకూ అందరూ సైబర్ మోసగాళ్ల చేతుల్లో పడి

Cyber Security: మీ ఫోన్‌లో ఇలాంటి అలెర్ట్ కనిపిస్తే.. మీ మొబైల్‌ను ఎవరో ట్యాప్ చేసినట్లే..! ఎలా గుర్తించాలంటే..
Cyber Security Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 20, 2023 | 10:32 AM

సైబర్ మోసాలు విపరీతంగా పెరిగినపోయిన ప్రస్తుత కాలంలో మన వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా ఉంది. రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకూ అందరూ సైబర్ మోసగాళ్ల చేతుల్లో పడి మోసపోతున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనే సమస్య ప్రస్తుత కాలంలో కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరి మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు దొంగిలించి అక్రమ కార్యకలాపాలకు అనువుగా మలుచుకుంటున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ రహస్య వివరాలను తెలుసుకొని వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును స్వాహ చేస్తున్నారు.

ఇంకా చెప్పుకోవాలంటే ఫోన్ యజమాని స్వయంగా పంపించినట్లుగా అనుచిత మెసేజ్‌లను ఇతరులకు పంపి వారికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. ట్రాక్‌ వ్యూ లాంటి యాప్స్ ఇందుకు బాగా సహకరిస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కొసం కొన్ని రకాల టెక్నికల్ టిప్ప్ ఫాలో అయితే సరి.. మోసపోకుండా జాగ్రత్త వహించవచ్చు. మరి అందుకోసం  ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. మొబైల్‌ నుంచి శబ్దాలు: మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే.. మీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని అనుమానించవచ్చు. నెట్‌వర్క్‌ సమస్యల వల్ల ఈ శబ్దాలు వచ్చినప్పటికీ ఫోన్‌ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తే తప్పక అనుమానించాల్సిందే.
  2. సౌండ్‌ బ్యాండ్‌ విడ్త్‌ సెన్సార్: ఫోన్ ట్యాపింగ్‌ను ఖచ్చితంగా నిర్థారించుకోవాలంటే సౌండ్‌ బ్యాండ్‌ విడ్త్‌ సెన్సార్ ద్వారా సాధ్యపడుతుంది. ఈ సెన్సార్‌ను ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు.
  3. బ్యాటరీ లైఫ్‌: మనకు తెలియకుండా మన ఫోన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రన్‌ అవుతుంటే బ్యాటరీ లైఫ్‌ భారీగా పడిపోతుంది. ఒకవేళ ఇలా జరుగుతుంటే దీనికి సరైన కారణాలు వెతుక్కోవాలి. ఛార్జింగ్ సమయం, కాల్స్ సమయం, యాప్స్ వాడక, నెట్ బ్రౌజ్ లాంటి అంశాలను మనం చెక్ చేసుకోవాలి.
  4. బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్‌: సెట్టింగ్స్‌->బ్యాటరీ సెట్టింగ్స్-> బ్యాటరీ యూసేజ్ ఆప్షన్‌తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్‌, కోకోనట్‌ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.‌ కొత్త ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం సంవత్సరం వరకు బాగా ఉంటుంది. ఆ తరువాత తగ్గిపోతుంది. అప్పుడు బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్‌, జీపీఎస్‌, వైఫై ఆఫ్‌ చేయడంతోపాటు, డిస్‌ప్లే స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ని తక్కువగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.
  5. ఆటోమేటిక్‌గా ఆన్‌/ఆఫ్‌: మీ ప్రమేయం లేకుండానే ఫోన్‌ ఆన్‌/ఆఫ్ అవుతోందా..? అయితే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేసినట్లే.. మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తారు.
  6. అలర్ట్స్‌ను యాక్టివేట్‌: మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలర్ట్స్‌ను యాక్టివేట్‌ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్‌లో ఎలాంటి యాప్స్‌ ఇన్‌స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్‌కు అలెర్ట్‌ మెసేజ్‌ వెళ్తుంది.
  7. యాప్స్‌ డౌన్‌లోడ్‌: యాప్‌స్టోర్‌ నుంచి గానీ, గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి గానీ యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా యాప్స్‌లో స్పైవేర్‌కి సంబంధించిన లక్షణాలు లేనప్పుడే వాటిని డౌన్‌లోడ్‌ చేయాలి. అయితే అధికారిక యాప్‌ స్టోర్‌ లేదా ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ అన్నీ దాదాపు స్క్రీనింగ్‌ చేసినవే ఉంటాయి.
  8. గేమింగ్‌ యాప్స్‌: గేమింగ్‌ యాప్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు కాల్‌ హిస్టరీ, అడ్రస్‌ బుక్‌, కాంటాక్ట్‌ లిస్ట్‌ కోసం పర్మిషన్‌ అడిగితే వాటిని వాడాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. మరికొన్ని చీటింగ్‌ యాప్స్‌ మనందరికీ తెలిసిన పేరుతో.. అదే లోగోతో కనిపిస్తాయి. అందువల్ల డౌన్‌లోడ్‌ చేసే ముందు ఆ యాప్‌ డెవలపర్‌ పేరును చెక్‌ చేసుకోవడం మంచిది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.